స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న చాలా మందికి ట్రూకాలర్ (true caller) అప్లికేషన్ గురించి తెలిసే ఉంటుంది. గుర్తు తెలియని నెంబర్ల (Unknown numbers) వివరాలను తెలియజేయడం, అనవసరమైన (unwanted calls), స్పామ్ కాల్స్‌ను (Spam calls) బ్లాక్ చేయడంలో ఈ అప్లికేషన్ (Call blocking app) సహాయపడుతుంది.
ఇప్పుడు ఈ యాప్ తన సేవలను మరింత విస్తరించే దిశగా ముందడుగు వేసింది.
ట్రూకాలర్ అప్లికేషన్ వాడుతున్న తమ వినియోగదారులకు ట్రూకాలర్ వాయిస్ (true caller voice) సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్ తో ఇంటర్నెట్ అధారంగా ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
ట్రూకాలర్ లోని ఇన్ యాప్ VoIP (Voice-over Internet Protocol) ఫీచర్ ద్వారా హైక్వాలిటీ వాయిస్ కాల్స్ (HD Voice Calls) ను మొబైల్ డేటా (Mobile data) లేదా వైఫై నెట్‌వర్క్ (Wifi) ఏది ఉన్నా సరే కాల్స్ చేసుకోవచ్చు. వినియోగదారుల సౌకర్యార్థం ఇప్పటికే ఫోన్ లోని కాల్ లాగ్, ఎస్ఎంఎస్ బాక్స్, కాంటాక్ట్ లిస్ట్ లాంటి చోట్ల దీనికి సంబంధించి షార్ట్‌కట్స్ ను కూడా క్రియేట్ చేసింది. ఎప్పుడైనా, ఎవరికైనా ఫోన్ కాల్ చేయాల్సి వచ్చినపుడు, ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంటే ట్రూకాలర్ వాయిస్ ను ఎంచుకోవాల్సిందిగా డిస్‌ప్లే మీద ఒక ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ట్రూకాలర్ నుంచి ఈ సదుపాయం అందుబాటులో ఉండగా, జూన్ 10, 2019 నుంచి భారత్ లో కూడా ఈ వాయిస్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ఐఓఎస్ ఆధారిత ఫోన్లలోనూ తీసుకురాబోతున్నట్లు ట్రూకాలర్ కంపెనీ యాజమాన్యం తెలిపింది.
ఒక్క వాయిస్ కాల్స్ కే పరిమితం కాకుండా మెసేజ్, చాటింగ్, మెసేజ్ ఫిల్టర్, మెసేజ్ బ్లాక్ లిస్ట్ ఆప్షన్స్ తో పాటు డిజిటల్ చెల్లింపులు కూడా ట్రూకాలర్ యాప్ నుంచే చేసేలా యాప్‌ను మరింత మెరుగుపరుస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.