UPI Limits on Payments Apps: గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే ల్లో రోజువారీ లిమిట్ ఎంతో తెలుసా? ఈ యాప్స్‌లో లిమిట్ తెలుసుకోకుండా ట్రాన్సాక్షన్ చేస్తే అంతే సంగతులు
UPI (Photo Credit- Wikimedia Commons)

New Delhi, JAN 07: యునైటెడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ (UPI) రాక‌తో న‌గ‌దు లావాదేవీలు సుల‌భ‌త‌రం అయ్యాయి. మీరు మీ యూపీఐ ఐడీని ఉప‌యోగించి ఇత‌రుల‌కు మ‌నీ పంపొచ్చు.. ఇత‌రుల నుంచి పొందొచ్చు. ఇంట్లోకి అవ‌స‌ర‌మైన గ్రాస‌రీ కొనుగోళ్ల నుంచి ఎలక్ట్రిసిటీ బిల్లు పేమెంట్స్.. ఒక్కటేమిటి.. ఏ వ‌స్తువు కొన్నా.. ఏ బిల్లు చెల్లించాల్సి వ‌చ్చినా యూపీఐ ఐడీ వ‌చ్చాక మ‌న చేతిలో ప‌ని అన్నట్లు క్షణాల్లో పేమెంట్ జ‌రిగిపోతుంది. అయితే, యూపీఐ ద్వారా అంటే గూగుల్ పే (Google Pay) లేదా జీ-పే, ఫోన్ పే (Phone pe), పేటీఎం (Paytm), అమెజాన్ వంటి మొబైల్ పేమెంట్ యాప్స్ (payments) ద్వారా జ‌రిపే చెల్లింపుల్లో ప‌రిమితులు ఉన్నాయి.

Pegasystems Layoffs: అమెజాన్ బాటలో మరో దిగ్గజం, 4 శాతం ఉద్యోగులను తొలగిస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్, స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలతో కంపెనీ 

నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఒక వ్యక్తి తన యూపీఐ ఐడీ ద్వారా ఒక రోజులో రూ.ల‌క్ష వ‌ర‌కు న‌గ‌దును ఇత‌రుల‌కు బ‌దిలీ చేయొచ్చు. ఇత‌రుల నుంచి పొందొచ్చు. ఇప్పుడు యూపీఐ లావాదేవీల నిర్వహ‌ణ‌కు సాధార‌ణంగా చాలా మంది.. గూగుల్ పే (జీ-పే), పేటీఎం, ఫోన్‌పే యాప్స్ వాడుతుంటారు. ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో మీ న‌గ‌దు బ‌దిలీపై విభిన్న గ‌రిష్ట ప‌రిమితులు ఉన్నాయి. అవేమిటో ఓ లుక్కేద్దామా..!

అమెజాన్ పే ద్వారా ఇలా

ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్ అనుబంధ యూపీఐ యాప్ `అమెజాన్ పే ( Amazon Pay)` ద్వారా ఒక రోజులో యూపీఐ లావాదేవీ జ‌రిపేందుకు రూ.ల‌క్ష వ‌ర‌కు అనుమ‌తి ఉన్నది. అమెజాన్ పేలో రిజిస్టర్ అయిన తొలి 24 గంట‌ల్లో మాత్రం గ‌రిష్టంగా రూ.5000 వ‌ర‌కు మాత్ర‌మే బ‌దిలీ చేసేందుకు అనుమ‌తిస్తున్నది.

జీ-పేలో ప‌ది లావాదేవీల‌కు ప‌రిమితం

అమెజాన్‌పే మాదిరిగానూ గూగుల్ పే లేదా జీ-పే ద్వారా ఒక రోజులో రూ.ల‌క్ష మించి ఇత‌రుల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌లేరు. జీ-పే ద్వారా జ‌రిపే లావాదేవీల సంఖ్య పైనా ప‌రిమితులు ఉన్నాయి. అన్ని ర‌కాల యూపీఐ అప్లికేష‌న్స్ (మొబైల్ యాప్స్) ద్వారా ఒక రోజులో ప‌ది సార్ల‌కు మించి న‌గ‌దు పంప‌లేరు.

ఫోన్‌పేలో ట్రాన్సాక్షన్స్ ఇలా

మ‌రో యూపీఐ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పేలోనూ ఒక రోజులో రూ.ల‌క్ష‌కు మించి క్యాష్ ట్రాన్స్‌ఫ‌ర్ అనుమ‌తించ‌రు. ఇది కూడా న‌గ‌దు బ‌దిలీ చేసే వ్యక్తి బ్యాంకు ఖాతాను బ‌ట్టి కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.

పేటీఎంలో గ‌రిష్టంగా 20 లావాదేవీలు

ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం యూపీఐ ద్వారా ఒక్కరోజులో రూ.ల‌క్షకు మించి ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డానికి నిబంధ‌న అనుమ‌తించ‌దు. గంట‌లోపు రూ.20 వేల వ‌ర‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయొచ్చు. ఒక గంట‌లో గ‌రిష్టంగా ఐదు, ఒక రోజులో 20 లావాదేవీలు నిర్వహించొచ్చు. మొబైల్ యాప్స్ యూపీఐ ట్రాన్స్‌ఫ‌ర్ లిమిట్‌, మొబైల్ యాప్స్ ఖాతాదారుల బ్యాంకుల‌ను బ‌ట్టి కూడా న‌గ‌దు బ‌దిలీ ప‌రిమితి ఆధార ప‌డి ఉంటుంది.