అద్బుతమైన ఫీచర్లతో అందుబాటు ధరలో వివో మొబైల్ తయారీ సంస్థ తన కొత్త Vivo Y12 స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

డ్యుఎల్ నానో సిమ్ (Dual Nano Sims)  వెసులుబాటుతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ అక్వా బ్లూ (Aqua Blue) మరియు బర్గండీ రెడ్ (Burgundy Red)  వంటి రెండు ఆకర్శణీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.

వివో స్మార్ట్‌ఫోన్ లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరా గురించి. ఈ Vivo Y12  లో కూడా వెనక వైపు ఎల్ఈడీ ఫ్లాష్ (LED Flash) తో కూడిన 3 రకాలకెమెరా ఆప్షన్స్ ఇచ్చారు.  మొదటి కెమెరా 13 మెగాపిక్సెల్, రెండో కెమెరా 8 మెగా పిక్సెల్ మరియు మూడవ కెమెరా 2 మెగా పిక్సెల్ గా ఉంది. వీటితో టైమ్ ల్యాప్స్ (Time Lapse), లైవ్ ఫోటోస్ (Live Photo), పనోరమ (Panorama), సూపర్ వైడ్ యాంగిల్ (Super Wide Angle) లాంటి వివిధ రకాల ఫోటో చిత్రీకరించవచ్చు.

ముందువైపు 8 మెగా పిక్సెల్ తో సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది వీడియో చాట్ (Video Chat) ను బాగా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీలు అందంగా వచ్చేందుకు వివిధ ఆప్షన్స్ సెట్ చేసుకునే వీలుగా Potrait Bokhe, AI Face Beauty లాంటి ఫీచర్స్ ఇచ్చారు. భారత మార్కెట్లో దీని ధర 12,490 గా నిర్ణయించారు.

Vivo Y12 విశిష్టతలు ఇలా ఉన్నాయి

6.35 ఇంచుల స్క్రీన్, 720x1544 పిక్సెల్స్ రెసల్యూషన్

13+8+2 మెగా పిక్సెల్ వెనక కెమరా, 8 మెగా పిక్సెల్ ముందు కెమరా

మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం

ర్యామ్ 4 జీబీ, స్టోరేజ్ 32 జీబీ

అండ్రాయిడ్ 9 పై (Android 9 Pie) ఆపరేటింగ్ సిస్టమ్

ధర, రూ: 12,490/-