వివో మొబైల్ తయారీ సంస్థ కొత్తగా 'ఎస్' సిరీస్‌లో తన తొలి Vivo S1 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెండు ఆకర్శణీయమైన రంగులో విడుదలకాబడిన ఈ ఫోన్, ఆగష్టు 08 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. వివో స్టోర్లతో పాటు ఇతర ప్రముఖ మొబైల్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయవచు. ఆన్‌లైన్ అమ్మకాల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.

ఈ ఫోన్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టైల్. స్కైలైన్ బ్లూ, డైమండ్ బ్లాక్ రెండు రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ చూపరులను ఆకర్శిస్తుంది. ఇక టెక్నికల్ విషయాలను పరిశీలిస్తే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్‌ అన్‌లాక్, ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 18W డ్యుఎల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

 

ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఫోన్ స్పీడ్ లేదా స్టోరేజ్ ఆధారంగా ధరలు ఉన్నాయి. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,990. ఇంకోటి 6GB RAM and 64GB వేరియంట్ ధర రూ. 18,990 మరియు 6GB RAM and 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,990 లుగా నిర్ణయించారు.

Vivo S1  Smartphone ఇతర విశిష్టతలు ఇలా ఉన్నాయి

6.38 ఇంచుల స్క్రీన్, 1080x2340 పిక్సెల్స్ రెసల్యూషన్

16+8+5 మెగా పిక్సెల్ వెనక కెమరా, 32 మెగా పిక్సెల్ ముందు కెమరా

మీడియాటెక్ హీలియో P65 ఆక్టాకోర్ ప్రాసెసర్

4500 mAh బ్యాటరీ సామర్థ్యం

ర్యామ్ 4 జీబీ మరియు 6 జీబీ వేరియంట్లు

అండ్రాయిడ్ 9 పై (Android 9 Pie) ఆపరేటింగ్ సిస్టమ్.