WhatsApp Logo. Representative Image. (Photo Credits: IANS)

New Delhi, July 20: నిమిషానికో మెసేజ్, సెకనుకో వాట్సాప్ నోటిఫికేషన్ తో (Whatsapp Notifiacations) విసిగిపోయారా? అయితే వాట్సాప్ మెసేజ్ ల నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఒకవేళ వాట్సాప్(Whatsapp) నుంచి బ్రేక్ కావాలంటే దాన్ని చాలా మంది అన్ ఇన్ స్టాల్ (Uninstall)చేస్తుంటారు. కానీ మళ్లీ వాట్సాప్ వాడాలనుకున్నప్పుడు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మళ్లీ ఇన్ స్టాల్ చేయడం, బ్యాకప్ ను (Backup) రిట్రైవ్ చేయడం వంటి పనులుంటాయి. అయితే వాట్సాప్ నుంచి బ్రేక్ తీసుకునేందుకు అన్ ఇన్ స్టాల్ చేయకుండా...డిసేబుల్ (disable) చేసే ఆప్షన్ కూడా ఉంది. అది మీకు తెలియకపోతే, చాలా ఈజీ! వాట్సాప్ ను అన్‌ ఇన్‌స్టాల్ చేయకుండా ఎలా డిసేబుల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇదుగోండి!

FB Multiple Profiles: ఒక ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటే చాలు 5 ప్రొఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఫేక్ అకౌంట్లకు చెక్‌ పెట్టేందుకు ఫేస్‌బుక్‌ సరికొత్తవ్యూహం, త్వరలోనే అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్ 

వాట్సాప్ ను కొద్దిరోజుల పాటూ డిసెబుల్ చేయాలంటే ట్రిక్స్ః

వాట్సాప్ యాప్‌పై ఎక్కువసేపు నొక్కి ప‌ట్టండి.. ‘యాప్ ఇన్‌ఫో’ ఐకాన్ క‌నిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి.

ఇప్పుడు టాప్‌లో ‘ఫోర్స్ స్టాప్’ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దానిపై నొక్కండి.

బ్యాక్‌గ్రౌండ్‌లో ‘వాట్సాప్ యాప్‌’ను క్లోజ్ చేయండి.

ఇది పూర్త‌వ‌గానే ఇక‌పై ఈ యాప్‌లో మెసేజెస్ ఆగిపోతాయి.

ఇది పూర్తయిన తర్వాత, మీరు ఇకపై ఈ యాప్‌లో సందేశాలను స్వీకరించడం ఆపివేస్తారు.

Reliance Jio: ఆదానికి షాకిస్తూ జియో మరో సంచలనం, 5జీ స్పెక్ట్రం వేలం కోసం ఏకంగా రూ. 14 వేల కోట్ల డిపాజిట్, భారతి ఎయిర్‌టెల్‌ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 2,200 కోట్లు డిపాజిట్  

అయితే మీరు వాట్సాప్‌ను ఓపెన్ చేస్తే అది మళ్లీ పని చేయడం ప్రారంభిస్తుంది. మెసేజెస్ వ‌స్తాయి. మీరు యాప్‌ను మ‌ళ్లీ డిసేబుల్ చేయాలనుకుంటే ‘ఫోర్స్ స్టాప్’ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.