WhatsApp (Photo Credits: Pixabay)

New Delhi, May 17: స్పామ్ వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ లకు చెక్ పెట్టేందుకు కేంద్రం చేసిన కృషి ఫలించింది. ఏదైనా నెంబర్ నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తున్నట్లు గుర్తించి, దాన్ని రిపోర్ట్ చేస్తే వెంటనే ఆ నెంబర్ ను బ్లాక్ చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు మెటా అంగీకారం తెలిపినట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి. దీనిపై వాట్సాప్ యాజమాన్యానికి నోటీసులు పంపించింది కేంద్ర ఐటీశాఖ. అయితే స్పామ్ కాల్స్ చేస్తున్న నెంబర్లను పర్మినెంట్‌ గా డిసేబుల్ చేసేందుకు మెటా అంగీకరించింది.

Research On Phone Calls and High Blood Pressure: 30 నిమిషాల కంటే ఎక్కువగా ఫోన్ మాట్లాడేవారికి అధిక రక్తపోటు, కొత్త అధ్యయనంలో వెల్లడి 

కస్టమర్ల సెఫ్టీ తమకు ముఖ్యమని, అందుకే స్పామ్స్ కాల్స్, మెసేజ్‌ లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. కేవలం వాట్సాప్ మాత్రమే కాదు. టెలిగ్రాం వంటి ఇతర మెసేజింగ్ యాప్స్ తో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు అశ్వనీ వైష్ణవ్. వాట్సాప్ లో పెరిగిన స్పామ్ కాల్స్ పై ఇటీవల వాట్సాప్ యజమాన్యానికి నోటీసులు పంపింది కేంద్రం. ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, కెన్యా, ఇథియోపియా నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది.