WhatsApp’s hidden feature: Even without blue tick, you can know if your message is read or not(Photo-pixabay)

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ 17.5 లక్షల యూజర్ల అకౌంట్లను డిలీట్ చేసింది. దేశంలోని ఐటీ రూల్స్ 2021కు అనుగుణంగా నవంబర్ నెలలో 1,759,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. అదే నెలలో 602 గ్రీవియెన్స్ రిపోర్టులు వచ్చాయని వాటిలో 36 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ వినియోగించే యూజర్లకు భద్రత పరంగా మెరుగైన సేవలు అందించేందుకు సందేశాలకు ఎండ్-టు-ఎండ్ రక్షణ కలిపిస్తున్నట్లు తెలిపింది.

అలాగే, కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల భద్రత కోసం కృత్రిమ మేధస్సు, ఇతర అత్యాధునిక సాంకేతికత, డేటా శాస్త్రవేత్తలు, నిపుణుల మీద నిరంతరం పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ భారతదేశంలో అక్టోబర్ నెలలో 20 లక్షల ఖాతాలకు పైగా నిషేదించింది. అలాగే, అదే నెలలో 500 గ్రీవియెన్స్ రిపోర్టులు వచ్చాయి. మనదేశంలో 40 కోట్లకు మందికి పైగా ప్రజలు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. మేలో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనలకు మేరకు.. 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న ప్రతి డిజిజల్ ప్లాట్‌ఫామ్ ప్రతి నెలా తమకు అందిన ఫిర్యాదుల వివరాలు, తీసుకున్న చర్యలను వెల్లడించాలి. ఈ క్రమంలో కొత్త ఐటీ చట్ట ప్రకారమే.. బ్యాడ్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటోంది.