WhatsApp (Photo Credits: Pixabay)

New Delhi, March 19: మెటా అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త‌న యూజ‌ర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచ‌ర్లు అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. త్వరలో వచ్చే కొంగొత్త ఫీచర్ల సంగతి చెబుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఉండటంతోపాటు త్వరలో అందుబాటులోకి వచ్చే ఆసక్తికరమైన ఫీచర్లు చాలా ఉన్నాయి. వాట్సాప్‌లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నా.. అటాచ్‌మెంట్‌ సెక్షన్‌లో పెద్ద మార్పులేం జరుగలేదు. కొత్తగా వచ్చే వర్షన్‌ (v2.23.6.17)లో మాత్రం అటాచ్‌మెంట్‌ పాప్‌ ఆప్‌ స్టైల్‌ పూర్తిగా మారిపోతున్నది. మొబైల్‌ ఫోన్లలో నోటిఫికేషన్‌ ఫ్యానల్‌ మాదిరిగా ఉండబోతున్నది. వాట్సాప్‌లో చేరిన వ్యక్తి పేరు సెర్చ్‌ చేస్తే.. అతడు సభ్యుడిగా ఉన్న గ్రూపుల వివరాలు కూడా బాగుంటుందనిపించవచ్చు.. త్వరలోనే ఆ ఫీచర్‌ కూడా యూజర్‌కి అందుబాటులోకి వచ్చేలా మార్పులు జరిగాయి. గ్రూప్స్‌ ఇన్‌ కామన్‌ (Groups in Common) పేరుతో ఈ ఫీచర్‌ వస్తున్నది. ఇందుకనుగుణంగా బీటా వర్షన్‌ వాట్సాప్‌లో మార్పులు చేర్పులు చేశారు.

ఇప్పటివరకు వాట్సాప్‌గ్రూప్‌లో కావాలనుకున్న వారు జాయిన్‌ కావొచ్చు. గ్రూప్‌ ఇన్వైట్‌ లింక్‌ ఉంటే.. దాన్ని క్లిక్‌ చేసి జాయినైపోవచ్చు. కానీ ఇక నుంచి అలా చేయాలంటే సంబంధిత గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి తప్పనిసరి. గ్రూప్‌ ఇన్ఫర్మేషన్‌లోకి వెళితే అక్కడ పెండింగ్‌ పార్టిసిపెంట్స్‌ (Pending participants) అనే ఆప్షన్‌ ఉంటది. అక్కడ కొత్త రిక్వెస్ట్‌లు చూడవచ్చు.

Modi Govt Plan For Data Theft: మొబైల్ యూజర్ల కోసం కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై డాటా చౌర్యం జరుగకుండా కఠిన నిబంధనలు, ప్రి ఇన్‌స్టాల్డ్ యాప్స్ విషయంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక 

ఇప్పటివరకు వాట్సాప్‌ గ్రూపులో ఇతరుల చాటింగ్‌ దగ్గర ఆ వ్యక్తి పేరు వస్తుంది. ఆ వ్యక్తి ఫోన్‌ నంబర్‌ మీ మొబైల్‌ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేకపోతే నంబర్‌ మాత్రమే వస్తుంది. దీనివల్ల మెసేజ్‌ ఎవరు చేశారన్న సంగతి గుర్తించడం అంత తేలిక్కాదు. కానీ నంబర్‌కు బదులు త్వరలో సదరు వ్యక్తి పేరు వస్తుంది. అంటే సదరు యూజర్‌, వాట్సాప్‌లో పెట్టుకున్న పేరు మీకు వస్తుంది. ఇప్పటిదాక వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లకు ఎక్స్‌పైరీ ఉంది. కానీ త్వరలో వాట్సాప్ గ్రూప్‌కే ఎక్స్‌పైరీ వచ్చేస్తుంది. ఏదైనా అవసరం కోసం కొన్ని రోజులు తాత్కాలికంగా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకునే ఆప్షన్‌ తెస్తున్నారు. గ్రూప్‌ క్రియేట్‌ చేస్తున్నప్పుడే అది ఎన్ని రోజులు ఉండాలనే ఆప్షన్‌ అడుగుతుంది. అక్కడ నమోదు చేసే టైం ప్రకారమే సదరు వాట్సాప్ గ్రూప్‌ లైవ్‌లో ఉంటది.

Mice with Two Dads: ఆడవారి అవసరం లేకుండా ఇద్దర మగవాళ్లతోనే సంతానం, శాస్త్రవేత్తల కొత్త సృష్టి, రెండు మగ ఎలుకలతో పిండాన్ని అభివృద్ధి చేసిన సైంటిస్టులు 

పలు మొబైల్‌ ఫోన్లలో సంబంధిత వ్యక్తుల కాంటాక్ట్‌లో లేని నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తే వాటిని మ్యూట్‌ చేయొచ్చు.. బ్లాక్‌ చేయొచ్చు. ఇలా చాలా మొబైల్స్‌లో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో వాట్సాప్‌లోనూ తెస్తున్నారు. గుర్తు తెలియని నంబర్‌ నుంచి వచ్చే కాల్‌.. మ్యూట్‌లోకి వెళ్లిపోతుంది. తర్వాత కాల్‌ లిస్ట్‌లోకి వెళ్లి.. అన్‌నోన్‌ కాల్స్‌ చెక్‌చేసుకోవచ్చు.