Xiaomi RedMiK20 Smartphones

ప్రముఖ మొబైల్ బ్రాండ్ల సంస్థ షియోమి (Xiaomi) నుంచి రెడ్ఎంఐ కే20 మరియు రెడ్ఎంఐ కే20ప్రో స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లోకి వచ్చేశాయి. భారీ ఫీచర్లు గల ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా వాటికి తగినట్లుగానే ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఒకే రకమైన హార్డ్‌వేర్ ఇచ్చారు. రెడ్ఎంఐ కే20 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుండగా, రెడ్ఎంఐ కే20 ప్రో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటి వరకు షియోమి సంస్థ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్లకు పూర్తి భిన్నం. మొబైల్ గేమింగ్స్‌ను అమితంగా ఇష్టపడేవారికి ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆన్‌లైన్ గేమ్స్‌ను బాగా సపోర్ట్ చేస్తాయి. ఈ స్మార్ట్‌‌ఫోన్లలో ర్యామ్ వరుసగా 6 జీబీ మరియు 8 జీబీగా ఉన్నాయి. వీటిలో ఫుల్‌ హెచ్‌డీ అమొలెడ్ డిస్‌ప్లే తో మీ ఫోన్ స్క్రీన్ సంపూర్ణంగా ప్రతి అంచువరకు కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు గ్లేసియర్ బ్లూ, ఫ్లేమింగ్ రెడ్ మరియు కార్బన్ బ్లాక్ వంటి ముచ్చటైన మూడు రంగుల్లో లభ్యమవుతున్నాయి.  2019 జూలై 22 నుంచి 'ఎంఐ స్టోర్' మరియు 'ఫ్లిప్‌కార్ట్' లలో ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం అందుబాటులో ఉంటాయి.

6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ సామర్థ్యం గల రెడ్ఎంఐ కే20 స్మార్ట్ ఫోన్ ధర 21,999/- నుంచి ప్రారంభమవుతుండంగా, ఇందులోనే 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కోరుకుంటే దాని ధర రూ. 23,999/- గా ఉంది.  మరోవైపు 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ సామర్థ్యం గల రెడ్ఎంఐ కే20 స్మార్ట్‌ఫోన్‌ ప్రో ధర రూ. 27,999/- గా ఉండగా, 8GB ర్యామ్ మరియు 256 GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 30,999కి లభ్యమవుతోంది.

ఇప్పటివరకు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు అంటే షియోమి గుర్తుకొచ్చేది. ఇక వీటి ఎంట్రీతో షియోమి కూడా ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ సంస్థల జాబితాలోకి చేరిపోయింది.

Xiaomi Redmi K20 విశిష్టతలు..

6.39 అంగుళాల ఫుల్- హెచ్‌డీ స్క్రీన్

వెనక 48+13+8 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్

4000mAh బ్యాటరీ సామర్థ్యం

ర్యామ్ 6GB/64GB స్టోరేజ్ మరియు 6GB/128 జీబీ - రెండు వేరియంట్లు

అండ్రాయిడ్ 9 పై (Android 9 Pie) ఆపరేటింగ్ సిస్టమ్

Xiaomi Redmi K20 Pro విశిష్టతలు..

6.39 అంగుళాల ఫుల్- హెచ్‌డీ స్క్రీన్

వెనక 48+13+8 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 830 ప్రాసెసర్

4000mAh బ్యాటరీ సామర్థ్యం

ర్యామ్ 8GB/128GB స్టోరేజ్ మరియు ర్యామ్ 8GB/256GB స్టోరేజ్ - రెండు వేరియంట్లు

అండ్రాయిడ్ 9 పై (Android 9 Pie) ఆపరేటింగ్ సిస్టమ్.