Istanbul Blast. (Photo Credits: Twitter Video Grab)

Istanbul, NOV 13: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని (Istanbul) ఇస్తిక్‌లాల్‌లో రద్దీగా ఉండే షాపింగ్‌ ఏరియాలో ఆదివారం భారీ పేలుడు చోటు (Istanbul Blast) చేసుకున్నది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. డజన్ల కొద్దీ జనం గాయపడ్డారు. ఘటనను అధ్యక్షుడు ఎర్డోగాన్‌ (Turkey President) ఖండించారు. ఉగ్రదాడిగా సంకేతాలు అందుతున్నాయని, ఘటనలో భాగమైన నేరస్తులను గుర్తించేందుకు సంబంధిత విభాగాలు పని చేస్తున్నాయని ఎర్డోగాన్‌ పేర్కొన్నారు. ఘటన అనంతరం బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘సంఘటనా స్థలానికి నేను 50-55 మీటర్ల దూరంలో ఉన్నారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. ముగ్గురు, నలుగురు వ్యక్తులు నేలపై పడిపోవడం చూశాను’ అని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.

పేలుడుతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. భారీ శబ్దం రావడంతో పాటు నల్లని పొగ పేరుకుపోయింది. అనంతరం భద్రతా బలగాలు మోహరించారు. పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ఇస్తిక్‌లాల్‌ షాపింగ్‌ స్ట్రీట్‌లో సాయంత్రం 4 గంటల సమయంలో పేలుడు చోటు చేసుకున్నది.

Pakistan Drones On Border Doubled: బుద్ధి మారని పాకిస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్స్ ద్వారా డ్రగ్స్, ఆయుధాల సరఫరా, సంచలన రిపోర్టులో వెల్లడి.. 

ఇంతకు ముందు 2015-16లో జరిగిన దాడుల్లో ఇస్తిక్‌ లాల్‌ స్ట్రీట్‌ దెబ్బతిన్నది. ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ జరిపిన దాడుల్లో దాదాపు 500 మందికిపైగా మృతి చెందగా.. 2వేల మందికిపైగా గాయపడ్డారు.