పుల్వామా ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల తర్వాత, బలూచిస్థాన్ సమీపంలో పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడిలో కనీసం తొమ్మిది మంది సిబ్బంది (9 policemen killed) మరణించారు. 11 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి అనే నగరంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ ఆత్మాహుతి బాంబర్ మోటర్ సైకిల్‌తో పోలీసు ట్రక్కును బలంగా ఢీ కొట్టినట్టు (Suicide Bombing In Southwest Pakistan) తెలిపారు.
దీంతో సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్‌లు, భద్రతా సిబ్బంది హుటాహుటినా చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 11 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఐతే బలూచిస్తాన్ పుష్కలంగా లభించే గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడి చేస్తుందంటూ బలూచి జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా పోరాడుతున్నట్లు సమాచారం.
అఫ్గానిస్థాన్‌లో తెల్లవారుజామున మరోసారి భూకంపం, ఇండ్లనుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు
ది బలూచిస్తాన్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) మార్గంలో టర్బత్, పంజ్‌గూర్ మధ్య జరిగిన దాడికి బలూచ్ రాజి అజోయ్ సంగర్ (BRAS) బాధ్యత వహించారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్ చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది.
బలూచ్ రాజి అజోయ్ సంగర్ (BRAS) అనేది మూడు బలూచ్ స్వాతంత్ర్య అనుకూల సంస్థల కూటమి, అవి..బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్.
ఆదివారం ఉదయం పంజ్‌గూర్, టర్బత్ సిటీ మధ్య CPEC మార్గంలో పాకిస్తానీ భద్రతా దళాల పెట్రోలింగ్ బృందం, శిబిరంపై తమ యోధులు దాడి చేశారని BRAS ప్రతినిధి బలోచ్ ఖాన్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. జమ్మూ & కాశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి తర్వాత ఉపఖండంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ సంఘటన జరిగింది.
రు.
జమ్మూ & కాశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ జరిపిన ఉగ్రదాడిలో భారతదేశం 40 మందికి పైగా సిఆర్‌పిఎఫ్ జవాన్లను కోల్పోగా, ఆత్మాహుతి దాడికి పాల్పడిన వారికి 'పాకిస్తాన్ భద్రతా దళాలు' మద్దతు ఇస్తున్నాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆరోపించింది.