Kabul January 18  : ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)కు మరో కష్టం వచ్చింది. ఇప్పటికే తాలిబన్ల పాలనలో అష్లకష్టాలు పడుతున్న ప్రజలను, భూకంపం(Earthquake) అతలాకుతలం చేసింది. పశ్చిమ ప్రావిన్స్ బాద్గీస్‌(Badghis) లో భూకంపం సంభవించింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తుర్క్‌మెనిస్తాన్‌(Turkmenistan)తో సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ ప్రావిన్స్ బాద్గిస్‌లో రెండు వరుస భూకంపాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు 26 మంది మృత్యువాతపడ్డారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డట్లు సమాచారం. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే(US Geological Survey) ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 5.3 తీవ్రతతో తొలుత భూకంపం సంభవించింది. మళ్లీ సాయంత్రం 4 గంటల సమయంలో 4.9 తీవ్రతతో రెండోసారి మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనలతో ప్రభావితమైన గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని, మృతుల సంఖ్యం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

భూకంపం(Earthquake) కారణంగా పెద్ద ఎత్తున ఇండ్లు ధ్వంసమయ్యాయని ప్రావిన్స్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ చీఫ్‌ మహ్మద్ సర్వరీ తెలిపారు. ప్రావిన్స్‌లోని కడిస్‌ జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇంటి పైకప్పు కూలడంతో పలువురు చిక్కుకుని మరణించారని బద్గీస్ గవర్నర్ మహ్మద్ సలేహ్ తెలిపారు. చిన్నారులు, మహిళలు సహా పలువురు గాయపడ్డారని తెలిపారు. భూ ప్రకంపనల ధాటికి 700కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని మినిస్ట్రీ ఆఫ్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌ హెడ్‌ ముల్లా జనన్‌ సాకే తెలిపారు.