అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines )కు చెందిన 737 బోయింగ్ విమానం గాల్లో (mid air) ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ (emergency landing) చేశారు. ఒహాయె (Ohio)లోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Columbus International Airport) నుంచి ఈ విమానం ఫీనిక్స్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన 25 నిమిషాలకే ఓ పక్షుల గుంపు దాన్ని ఢీ కొట్టింది.
దీంతో విమానం కుడి వైపునున్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చి.. అనంతరం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని కొలంబస్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం కొలంబస్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అందులోని ప్రయాణికులను మరో విమానంలో అక్కడి నుంచి తరలించారు.
Here's Video
Taken from Upper Arlington, Ohio. AA1958. pic.twitter.com/yUSSMImaF7
— CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)