
Surrey, DEC 14: ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) అభిమానులకు చేదువార్త. ఫింట్లాఫ్ కారు ప్రమాదానికి గురికావడంతో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్సనిమిత్తం ఆస్పత్రిలో చేరించారు. అయితే, కొంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు. బీబీసీ షో టాప్ గేర్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అతని ప్రమాదం గురించి బీబీసీ (BBC) ప్రకటన విడుదల చేసింది.. టాప్‌గేర్ టెస్ట్ ట్రాక్ (Shooting for Top Gear) సమయంలో ఫ్లింటాప్ కు ప్రమాదం జరిగిందని, వెంటనే మెడికల్ బృందం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్ బీసీసీ టాప్ గేర్ షోలో (Top Gear Show) వ్యాఖ్యాతగా ఉన్నారు. 2019 నుంచి ఈ షోతో అతనికి అనుబంధం ఉంది. 2009లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఫింటాప్ 1998లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేశాడు. 141 వన్డేలు ఆడిన ఫ్లింటాప్ 32 సగటుతో 3,394 పరుగులు చేశాడు. 160 వికెట్లు తీశాడు. అదేవిధంగా 79 టెస్టుల్లో ఆడిన ఆయన 3,845 పరుగులు చేశాడు. 226 వికెట్లు తీశాడు. ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడి 76 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. ఫ్లింటాప్ ఇంగ్లాండ్ జట్టు విజయంలో అనేకసార్లు కీలక భూమిక పోషించాడు.
45ఏళ్ల ఆండ్రూ.. ఇలాంటి ప్రమాదాలకు గురికావడం మొదటిసారి కాదు. ఫిబ్రవరి 2019లో నాటింగ్‌హామ్ షైర్‌లోని మాన్స్‌ఫీల్డ్‌లోని మార్కెట్ స్టాల్‌పైకి దూసుకెళ్లాడు. అదే సంవత్సరం సెప్టెంబరులో అతను యార్క్‌షైర్‌లోని ఎల్వింగ్టన్ ఎయిర్‌ఫీల్డ్‌లో చిత్రీకరణ చేస్తున్నప్పుడు డ్రాగ్ రేస్‌లో క్రాష్ అయ్యాడు, కానీ క్షేమంగా బయటపడ్డాడు. ఫ్లింటాఫ్ 2019లో టాప్ గేర్‌లో హోస్ట్‌గా చేరారు. ప్యాడీ మెక్‌గిన్నిస్, క్రిస్ హారిస్‌లతో కలిసి షోలో సహనటులు.