New Delhi, May 08: ఆస్ట్రాజెనికా(AstraZeneca) కంపెనీ తన కోవిడ్ టీకాను ప్రపంచ మార్కెట్ల నుంచి వెనక్కి రప్పిస్తున్నది. ఆ టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు కోర్టులో రుజువు కావడంతో బ్రిటీష్ కంపెనీ తన ఉత్పత్తుల్ని వెనక్కి (AstraZeneca Withdraws COVID-19 Vaccine) తీసుకుంటున్నది. ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు ఈ టీకాను తయారు చేశారు. అయితే ఇండియాలో ఆ టీకాను కోవీషీల్డ్ (Covishield) పేరుతో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో కోవిడ్19కు చెందిన అప్‌డేటెడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, వాణిజ్య కారణాల దృష్ట్యా తమ టీకాను మార్కెట్ల నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ తెలిపింది. కొత్త వేరియంట్లను నియంత్రించగల కొత్త వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చేశాయని, అందుకే ఆ టీకాను మార్కెట్ల నుంచి విత్‌డ్రా చేస్తున్నట్లు ఓ మీడియాలో వెల్లడించారు.
AstraZeneca said it had initiated the worldwide withdrawal of its COVID-19 vaccine due to a 'surplus of available updated vaccines' since the pandemic, reports Reuters
— ANI (@ANI) May 8, 2024
యురోపియన్ యూనియన్‌లో ఈ టీకాను ఉత్పత్తి చేయడం లేదని, దీన్ని ఇక ముందు వాడబోమని కూడా కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ వాడుతున్నట్లు అన్ని దేశాల నుంచి టీకాలను వెనక్కి రప్పించనున్నట్లు తెలిపారు. కోవిడ్ టీకా వల్ల అనేక మంది మరణించారని ఆస్ట్రాజెనికా కంపెనీపై బ్రిటన్ కోర్టులో కేసులు ఉన్నాయి. ఆ కంపెనీపై వంద మిలియన్ల పౌండ్ల పరువునష్టం కేసు కూడా ఉన్నది. కోవీషీల్డ్ టీకా వల్ల కొన్ని అరుదైన కేసుల్లో థ్రాంబోసిస్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ కోర్టులో అంగీకరించింది. టీటీఎస్ వల్ల రక్తం గడ్డకడుతుంది. బ్లడ్ ప్లేట్లెట్ల కౌంట్ కూడా తగ్గుతుంది. టీటీఎస్ వల్ల బ్రిటన్‌లో సుమారు 81 మంది మరణించారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వాడడం వల్ల తొలి సంవత్సరం సుమారు 65 లక్షల మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల మందికి టీకా డోసులను సరఫరా చేశారు.