Representative Image

Missouri, FEB 11: పేగు తెంచుకుని పుట్టిన చిన్నారిని తొట్టిలో వేయడానికి బదులు పొరపాటున ‘ఓవెన్’లో (Mother Mistakenly Puts Her In Oven) పెట్టింది ఓ కన్నతల్లి.. ఫలితంగా ఆ నెలరోజుల చిన్నారి మరణించిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. మిస్సోరీలో ఒక నెల రోజుల పసికందు శ్వాస తీసుకోవడం లేదని వచ్చిన వార్తలపై మిస్సోరీ పోలీసులు స్పందించారు. కన్సాస్ సిటీలో గల ఆ ఇంటికెళ్లి చూస్తే శరీరం నిండా కాలిన గాయాలు, నిశ్చలంగా ఉన్న పసికందు కనిపించిదని పోలీసులు తెలిపారు. పరిస్థితిని బట్టి పసికందు మరణించినట్లు ప్రకటించారు. ఇది ఘోర విషాదం (US Crime) అని పేర్కొన్నారు. తొట్టిలో పడుకోబెట్టాననుకుని పొరపాటున నాప్ పై పెట్టానని పసికందు తల్లి తెలిపింది. ఆ పసికందుకు వేసిన దుస్తులు, డైపర్ కాలిపోయాయని అరెస్ట్ వారంట్ లో తెలిపారు.

Third Indian Student Death in US: అమెరికాలో కలవరపెడుతున్న భారత విద్యార్థుల మరణాలు, తాజాగా మరో విద్యార్థి శ్రేయాస్ రెడ్డి అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి, ఈ ఏడాదిలో ఇది నాలుగో ఘ‌ట‌న‌ 

ఇంట్లో పొగలు వస్తున్నాయని చూస్తే పసికందును పడుకోబెట్టిన బ్లాంకెంట్ తగలబడిపోయిందని తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఇదిలా ఉంటే పసికందు తల్లిని మరియా థామస్ (26) అని గుర్తించారు. పసికందు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశారని ఆమెపై అభియోగం మోపారు. ఈ ఘటనకు ఆమె మానసిక స్థితి కూడా కారణం కావచ్చునని నిందితురాలి స్నేహితురాలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెను జాక్సన్ కౌంటీ డిటెన్షన్ సెంటర్ కస్టడీలో ఉంచారు.