Brazilian Singer Darlyn Morais Dies (PIC@ X)

Brazil, NOV 09: సాలీడు.. ఓ చిన్న కీటకం. మన భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. దీన్ని సాలెపురుగు (Venomous Spider) అని కూడా అంటారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక మూలన గూడు కట్టుకుని అవి కనిపిస్తాయి. అందుకేనేమో మనం పెద్దగా వాటి గురించి పట్టించుకోము. సాలీడుని చాలా లైట్ తీసుకుంటాము. కానీ, సాలె పురుగు (Venomous Spider) కుడితే మాత్రం చాలా ప్రమాదం. ఎంత డేంజర్ అంటే.. కొన్ని సందర్భాలలో ప్రాణాంతకం.

సాలీడు కుట్టడంతో కొంతమంది చనిపోవడం షాక్ కి గురి చేసే అంశం. తాజాగా సాలీడు కుట్టడంతో ఓ వ్యక్తి మరణించాడు (Brazilian Singer Dies). షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. బ్రెజిల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెజీలియన్ సింగర్ డార్లిన్ మొరైస్ (Darlyn Morais) సాలీడు కుట్టడంతో చనిపోయాడు. ముఖంపై సాలెపురుగు కుట్టడంతో డార్లిన్ మొరైస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత అలర్జిక్ రియాక్షన్ తో చనిపోయాడు. ఈ విషయాన్ని డార్లిన్ భార్య స్వయంగా తెలిపింది.

Here's News

సాలెపురుగు (Bitten On Face) కుట్టిన చోట చర్మం నల్లగా మారిందని ఆమె వెల్లడించారు. కాగా సింగర్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. కాగా, డార్లిన్ ను కుట్టిన సాలీడు విషపూరితమైందని, అందువల్లే అతడు ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు చెబుతున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. డార్లిన్ మొరైన్ సవతి తల్లి కూతురు కూడా ఇలానే సాలీడు కుట్టడంతో ఆసుపత్రి పాలైంది. ఆమె కాలిపై సాలీడు కుట్టింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దర్శకుడు అర్పుదాన్‌ మృతి, వార్త ఆలస్యంగా వెలుగులోకి..

డార్లిన్ మొరైస్ వయసు 28ఏళ్లు. సాలీడు కుట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. నవంబర్ 3వ తేదీని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. చికిత్స అందించినప్పటికీ అతడి ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగవలేదు. దీంతో అతడిని మరో ఆసుపత్రికి తరలించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. డాక్టర్లు డార్లిన్ ను కాపాడలేకపోయారు.

డార్లిన్ మరణించినట్లు ప్రకటించారు. డార్లిన్ 15ఏళ్ల వయసులో సింగర్ గా తన కెరీర్ ప్రారంభించాడు. తన సోదరుడు, స్నేహితుడితో కలిసి అతడో బ్యాండ్ ని ఏర్పాటు చేశాడు. ఈ బ్యాండ్ ద్వారా పలు చోట్ల సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. డార్లిన్ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు, స్నేహితులు కన్నీటిపర్యంతం అయ్యారు. కాగా, సాలీడు కుట్టడంతో సింగర్ చనిపోయాడు అనే వార్త షాక్ కి గురి చేస్తోంది.