Britain, AUG 13: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లే దొంగలను (Thiefs) చూశాం. మరికొందరైతే వేషాలు వేసి, ఎవరికీ తెలియకుండా జీవిస్తుంటారు. అయితే బ్రిటన్‌కు (Britain) చెందిన ఓ యువకుడు మాత్రం దొంగతనాలు చేసి...పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సూపర్ ప్లాన్ వేశాడు. కానీ బ్యాడ్‌ లక్‌! పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ మనోడు ఏం చేశాడో తెలుసా? పోలీసుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు టెడ్డీబేర్‌ లో(Teddy Bear) దూరిపోయాడు. కానీ టైం బాగోలేక దొరికిపోయాడు. అతగాడు చేసిన పనితో ఇప్పుడు ఇంటర్నెట్‌ లో వైరల్‌ గా మారాడు. దొంగతనం చేసి పోలీసులకు ప్రియురాలి ముందే పట్టబడిపోవడంతో ముఖం చిన్నబుచ్చుకున్నాడు.బ్రిటన్ లోని మాంచెస్టర్ కు చెందిన ఈ దొంగప్రియుడు చోరకళ వ్యవహారాలు చాలా ఉన్నాయి. అతని పేరు జోషువా డాబ్సన్ (Joshua Dobson). ఈ 18 ఏళ్ల నవ యవ్వన ప్రియుడు ఇటీవల ఓ కారును దొంగతనం (Theft) చేశాడు. ఆ కారులో పెట్రోల్ పోసుకుని బంకు నుంచి డబ్బులు కట్టకుండా పరారయ్యాడు. ఈ చోరీలే కాదు గతంలో మనోడికి ఈ చోరకళలో చాలా ఘనతలే ఉన్నాయి. కార్లు దొంగతనం చేయడం, సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎత్తుకుపోవడం వంటి ‘దొంగ’ చరిత్ర కూడా ఉంది. దీంతో పోలీసులు అతడి కోసం వెతకటం మొదలుపెట్టారు.

పోలీసులు తనకోసం తీవ్రంగా వెదుకుతున్నారని తెలిసిన జోషువా (Joshua Dobson ) చాలా చోట్ల దాక్కున్నాడు. దాక్కుంటూ దాక్కుంటూ కొన్నాళ్లు గడిపాడు. అలా ఓ రోజు తన ప్రేయసి ఇంట్లో దాక్కున్నాడు. అక్కడ ఉన్నాడని తెలిసిన పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు అక్కడికీ రావడంతో గతంలో తన ప్రేయసికి గిఫ్టుగా ఇచ్చిన ఐదు అడుగుల టెడ్డీబేర్ లో దూరి కూర్చున్నాడు. టెడ్డీబేర్ లో ఉన్న దూది అంతా తీసేసి దాంట్లో దూరి కూర్చున్నాడు.

VLC Media Player Banned In India: భారత్ లో వీఎల్ సీ మీడియా ప్లేయర్ బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం, చైనా హ్యాకర్ల ముప్పు ఉందని ప్రకటన.. 

అంతా బాగానే ఉందిగానీ..కానీ టైమ్ బాగాలేదేమో అడ్డంగా బుక్ అయ్యాడు. పోలీసులు ఆ రూమ్ లోకి కూడా వచ్చి వెదుకుతుంటంతో భయపడిపోయాడు పాపం దొంగ ప్రియుడు. అప్పటి వరకు ఊపిరి బిగపట్టి ఇక ఆగలేక గట్టిగా శ్వాస తీసుకోవడంతో టెడ్డీబేర్ ఛాతీ భాగం కదిలింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానంతో పోలీసులు టెడ్డీ బేర్ ను పరిశీలిస్తే డాబ్సన్ అడ్డంగా పట్టుబడిపోయాడు. మాంచెస్టర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ ఫేస్‌ బుక్‌ లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఏదేమైనా టెడ్డీ బేర్ దొంగ పాపులర్ అయిపోయాడు.