New Delhi, August 28: జమ్మూ కాశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని ఇందులో పాకిస్థాన్ జోక్యాన్ని సహించబోమని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం వెల్లడించారు.
మోదీ సర్కార్ తీసుకునే ఎన్నో ఏకపక్ష నిర్ణయాల పట్ల ప్రతిపక్షంగా తాము వ్యతిరేకిస్తాము, అంతేకానీ తమ అంతర్గత వ్యవహారాలలో పాకిస్థాన్ సహా వేరే ఏ దేశం జోక్యం చేసుకున్నా సహించేది లేదని ట్విట్టర్ వేదికగా రాహుల్ స్పష్టం చేశారు.
జమ్మూ కాశ్మీర్ లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కానీ ఆ ఘటనల వెనక పాకిస్థాన్ హస్తం ఉంది. జమ్మూకాశ్మీర్‌లో జరిగే అన్ని హింసాత్మక ఘటనలు పాకిస్థాన్ ప్రేరేపితమైనవే, అసలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ప్రధాన మద్ధతుదారు పాకిస్థాన్ దేశమే అని తెలిసిందే కదా అని రాహుల్ సూటిగా చెప్పారు.
I disagree with this Govt. on many issues. But, let me make this absolutely clear: Kashmir is India’s internal issue & there is no room for Pakistan or any other foreign country to interfere in it.
— Rahul Gandhi (@RahulGandhi) August 28, 2019
I disagree with this Govt. on many issues. But, let me make this absolutely clear: Kashmir is India’s internal issue & there is no room for Pakistan or any other foreign country to interfere in it.
— Rahul Gandhi (@RahulGandhi) August 28, 2019
రాహుల్ గాంధీలో ఈ అనూహ్య మార్పు వెనక గల కారణాలు ఇవే.
జమ్మూ కాశ్మీర్‌లో మోదీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత దాదాపు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశం పట్ల మద్ధతు ఇచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం మాత్రం మోదీ సర్కార్‌ను వ్యతిరేకిస్తూ వచ్చింది.
జమ్మూ కాశ్మీర్‌లో నియంతృత్వ పాలన కొనసాగుతుందని, కాశ్మీరీ ప్రజల హక్కులను మోదీ సర్కార్ హరించి వేస్తుంది అంటూ కేంద్ర ప్రభుత్వం తీరుపై రాహుల్ గాంధీ గత కొంతకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ
రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు మోదీ సర్కార్‌పై చేస్తున్న విమర్శలనే పాకిస్థాన్ అస్త్రంగా మలుచుకుంది.
"జమ్మూ కాశ్మీర్‌లో రక్తపాతం జరుగుతుంది. భారత్‌లోని RSS భావజాల ప్రభుత్వం కశ్మీర్ లోని ముస్లిం ప్రజలను అణిచివేస్తుంది. వారిని అత్యంతహీనంగా, రెండవ తరగతి పౌరులలాగా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీనే ఈ విషయాలను ధృవీకరిస్తున్నారు. అంతటి రాహుల్ గాంధీకే కాశ్మీర్ వెళ్లకుండా తీవ్ర ఆంక్షలు ఉంటున్నప్పుడు, ఇక కాశ్మీర్‌లో సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. " అంటూ పాకిస్థాన్ పదేపదే ఐక్యరాజ్య సమితి, ఇతర ప్రపంచ దేశాల నేతలకు రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ నేతల వాఖ్యలను, ట్వీట్లను ఉదాహారణగా చూపిస్తూ వస్తుంది.
ఎంతలా అంటే జమ్మూ కాశ్మీర్ అంశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్‌పై ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎంత అభ్యర్థించినా ప్రపంచంలో ఏ దేశము పట్టించుకోలేదు. పాకిస్థాన్‌కు మద్ధతుగా మాట్లాడేందుకు ఏ ఒక్క దేశ నాయకుడు ముందుకు రాలేదు. చైనా ఒకసారి మద్ధతు ఇచ్చి దాని పరువు అదే పోగుట్టుకుంది, ఇక అది పాక్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ దశలో రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీపై చేస్తున్న విమర్శలే పాకిస్థాన్‌కు ఎడారిలో ఒయాసిస్‌లా కనిపించాయి. ఇక తమ గొంతుక వీరే అన్నట్లుగా పాకిస్థాన్ ప్రధాని సహా, అక్కడి మీడియా, అక్కడి ముఖ్య నాయకులు అందరూ రాహుల్ గాంధీ కాశ్మీర్ అంశంపై మాట్లాడే వీడియోలను, ట్వీట్లను ప్రధానంగా పబ్లిసిటీ చేస్తూ వస్తున్నారు.
దీంతో పాకిస్థాన్ తరఫున మాట్లాడేది ఒకరు పాకిస్థానే కాగా, మరొకరు ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అయింది. దీనిని ఆలస్యంగా గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు రాహుల్‌తో ట్వీట్ చేయించింది. 'మాలో మాకు చాలా వ్యవహారాలు ఉంటాయి, ఇక్కడ పాకిస్థాన్ ఎవరు? భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం వేలు పెట్టాల్సిన అవసరం లేదు' అన్నట్లు ఒక ఘాటైన సమాధానం ఇచ్చి పాక్ నోటికి తాళం వేసింది.
ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ, మోదీ సర్కార్‌ను ఎంత విమర్శించినా రాజకీయంగా నష్టమే జరిగింది కానీ, ప్రజల నుంచి మరియు ఇతర పార్టీల నుంచి ఎలాంటి మద్ధతు లభించలేదు. దీంతో దేశంలో కాంగ్రెస్ ఏకాకి అయిపోయింది. అందుకోసమే జమ్మూ కాశ్మీర్ అంశంలో మోదీకి మద్ధతివ్వడం ప్రారంభించి ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టాన్ని కొంత వరకు పూడ్చుకునే ప్రయత్నాలను చేపట్టింది.