Dawood Ibrahim (Photo Credits: PTI/File)

Islamabad, August 23: భారత్‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే కరాచీలో నివసిస్తున్నట్లు పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది.  ఉగ్రవాద కార్యకలాపాల కోసం పాకిస్థాన్ నిధులు సమకూరుస్తుందనే ఆరోపణలపై ప్యారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (FATF) జూన్ 2018లో పాకిస్థాన్ దేశాన్ని గ్రే లిస్టులో చేర్చింది. ఇకపై బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్‌ తాజాగా 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలు మరియు వాటి అధినేతలపై ఆంక్షలు విధించింది.

నిషేధిత జాబితాలో 1993 ముంబై సీరియల్ పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం పేరు కూడా ఉంది. దావుద్ ఇబ్రహీంతో పాటు జమాతుద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ ముసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరుల పేర్లను కూడా పాక్ నిషేధిత జాబితాలో చేర్చింది. వీరి స్థిర, చర ఆస్తులను సీజ్ చేసి, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నట్లు తెలియజేస్తూ రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది.

పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దావూద్ ఇబ్రహీం చిరునామా కరాచీలోని "వైట్ హౌస్, సౌదీ మసీదు దగ్గర, క్లిఫ్టన్". "హౌస్ ను 37 - 30 వ వీధి - రక్షణ, హౌసింగ్ అథారిటీ, కరాచీ" మరియు "కరాచీలోని నూరాబాద్ కొండ ప్రాంతంలోని పాలటియల్ బంగ్లా" అని పేర్కొంది.

నిషేధిత జాబితాలో దావూద్‌ పేరును చేర్చడం ద్వారా ఇంతకాలంగా సదరు మాఫియా డాన్ ఎక్కడున్నాడో తెలియడంటూ చెప్తూ వచ్చిన పాక్ ఇప్పుడు తమ దేశంలోనే ఉన్నట్లు తనకు తానుగా ప్రపంచానికి చెప్పినట్లయింది. అయితే ఈ వ్యవహారంపై భారతీయ మీడియాలో కథనాలు రావడంతో వెంటనే పాకిస్థాన్ తనదైన బుద్ధిని ప్రదర్శించింది. పాకిస్థాన్‌ను 'బ్లాక్ లిస్ట్'లో చేర్చిన FATF. మరింత దిగజారనున్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి.  భారత్ చేసిన కుట్రగా ఆరోపించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

దావూద్‌ తమ దేశంలోనే ఉన్నాడనే విషయాన్ని తాము అంగీకరించినట్లు భారత్‌ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. దావూద్‌కు తమ దేశంలో చోటు లేదని, అదేమి కొత్త నోటిఫికేషన్ కాదని, ఆ నోటిఫికేషన్‌ ద్వారా పాక్‌ ఎలాంటి కొత్త ఆంక్షలు విధించలేదని పేర్కొంది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.