Donald Trump (Credits: X)

Newdelhi, Sep 16: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆయన ఉన్న  సమీపంలో కాల్పుల (Firing) క‌ల‌క‌లం చెల‌రేగింది. ఫ్లోరిడాలోని (Florida) తన గోల్ఫ్ కోర్టులో (Golf Court) ఆయ‌న‌ ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా ఈ కాల్పులు జ‌రిగాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సీక్రెట్ స‌ర్వీసెస్ ట్రంప్‌ ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించింది. తుపాకీతో ఉన్న వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మాజీ అధ్యక్షుడిపై హత్యకు యత్నించిన వ్యక్తిని ర్యాన్ వెస్లీ రౌత్ (58) గుర్తించినట్లు అమెరికా మీడియా పేర్కొంది. హవాయి నివాసి అయిన  రౌత్.. నార్త్ కరోలినాలో నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు. ఘ‌ట‌నాస్థ‌లిలో ఏకే-47 స్టైల్ రైఫిల్, సిరామిక్ టైల్‌తో నిండిన రెండు బ్యాక్‌ప్యాక్‌లు, ఓ గోప్రో కెమెరాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేవలం రెండు నెలల వ్యవధిలో ట్రంప్‌పై ఇది రెండో హత్యాయత్నం కావ‌డం గ‌మ‌నార్హం. జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జ‌రిగిన కాల్పుల్లో మాజీ అధ్య‌క్షుడి కుడి చెవికి దెబ్బ తగిలిన విష‌యం తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగ్ కలకలం, అనుమానాస్పద బ్యాగ్‌ను తనిఖీ చేసిన పోలీసులు, బందోబస్తు మరింత పెంపు 

ట్రంప్ ఏమన్నారంటే?

‘నా సమీపంలో తుపాకీ కాల్పులు జరిగాయి. నేను సురక్షితంగా ఉన్నాను. ఇలాంటివి నన్ను ఏమీ ఆప‌లేవు. నేను ఎప్పటికీ లొంగిపోను’ అని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నందుకు సంతోషిస్తున్నానని, అమెరికాలో హింస‌కు తావు లేదు అని ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్ ట్వీట్ చేశారు.

జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?