Former Us President Donald Trump (PIC@ ANI twitter)

Hampshire, JAN 24: రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ఈసారి కూడా పోటీ ప‌డేందుకు అమెరికా మాజీ దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే పార్టీ అభ్య‌ర్థిత్వం కోసం జ‌రుగుతున్న ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే ఓ విక్ట‌రీ కొట్టిన ట్రంప్ ఇవాళ మ‌రో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమ‌రీలో (Hampshire GOP Primary) ఆయ‌న విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. దీంతో దాదాపు ఆయ‌నకు అధ్య‌క్ష అభ్య‌ర్థిగా లైన్ క్లియ‌ర్ అయ్యే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. న్యూ హ్యాంప్‌షైర్‌లో ట్రంప్‌కు 55 శాతం ఓట్లు ప‌డ్డాయి. ఇక రెండవ స్థానంలో నిక్కి హేలీ (Nikki Haley) ఉంది. వారం క్రితం ఐయోవాలో జ‌రిగిన ప్రైమ‌రీలో కూడా ట్రంప్ (Trump Win) నెగ్గిన విష‌యం తెలిసిందే.

 

న్యూ హ్యాంప్‌షైర్‌లో 22 మంది డిలీగేట్స్ ఉండ‌గా, దాంట్లో ట్రంప్ 11, హేలీ 8 గెలుచుకున్న‌ట్లు స‌మాచారం. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున‌ అధ్య‌క్ష అభ్య‌ర్థి రేసులో ఒక‌వేళ హేలీ ఉన్నా తాను ప‌ట్టించుకోబోన‌ని ట్రంప్ అన్నారు. ఆమె ఏం చేయాల‌నుకున్నా చేసుకోవ‌చ్చు అన్నారు. అయితే సౌత్ క‌రోలినాలో జ‌రిగే ప్రైమ‌రీ రేసులో మాత్రం త‌నదే విజ‌యం ఉంటుంద‌ని మ‌రో వైపు నిక్కీ హేలీ అన్నారు.