Dubai Princess Shaikha Mahra

Sharjah, July 17: దుబాయి యువరాణి (Dubai Princess) షైఖా మహ్రా మహ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ (Shaikha Mahra Mohammed Rashed) తన భర్తకు విడాకులిచ్చారు(Triple Talaq). ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా యువరాణి తన భర్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్‌తో విడిపోతున్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఈ జంట తొలి బిడ్డకు జన్మనించిన రెండు నెలలకే విడిపోవడం గమనార్హం. ఇన్‌స్టా పోస్ట్‌లో ‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే మీ నుంచి విడాకులు తీసుకుంటున్నాను. టేక్‌ కేర్‌.. ఇట్లు.. మీ మాజీ భార్య’ అంటూ షైఖా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను సైతం అకౌంట్ల నుంచి తొలగించారు.

 

దుబాయి పాలకుడైన షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె అయిన యువరాణి షైకా.. దుబాయికి చెందిన వ్యాపారవేత్త, కుబేరుడైన షేక్‌ మనా బిన్‌ మహ్మద్‌ అల్‌ మక్తూమ్‌ను 2023 మే 27న వివాహం చేసుకున్నారు. రెండునెలల కిందట షైకా, మనా దంపతులకు కూతురు జన్మించింది. ఇంతలోనే విడాకులు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. షైకా బ్రిటన్‌లోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదివారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో స్పెషలైజేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. భర్తతో విడిపోయిన షైకాకు పలువురు మద్దతుగా సందేశాలు వెల్లువెత్తాయి. షైకా గత జూన్‌లో ఇన్‌స్టా పోస్ట్‌లో ‘మనం ఇద్దరం మాత్రమే’ అంటూ కూతురుతో ఉన్న ఫొటోను షేర్‌ చేయడం ప్రస్తావనార్హం.