Earthquake in El Salvador: పసిఫిక్ తీరంలో భారీ భూకంపం, ఎల్‌ సాల్వడార్‌ లో 6.5 తీవ్రతతో కంపించిన భూమి, కేవలం 70 కి.మీ లోతులోనే భూకంప కేంద్రం
Earthquake Representative Image (Photo Credit: PTI)

El Salvadors, July 19: ఎల్ సాల్వడార్ పసిఫిక్ తీరంలో బుధవారం తెల్లవారుజామున భారీభూకంపం సంభవించింది. మళ్లీ రెండో సారి బుధవారం ఉదయం 5.52 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. (El Salvadors San Salvador Earthquake) మంగళవారం ఈ భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని ఎల్ సాల్వడార్‌ పర్యవరణ మంత్రిత్వశాఖ తెలిపింది. మంగళవారం అఫ్ఘానిస్థాన్ దేశంలోనూ భూకంపం సంభవించింది. సాయంత్రం ఎల్ సాల్వడార్ పసిఫిక్ తీరంలో దాదాపు 70 కిలోమీటర్ల లోతులో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. (Earthquake) ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు.

రాజధాని శాన్ సాల్వడార్‌కు సమీపంలో ఉన్న తీరప్రాంత నగరమైన లా లిబర్టాడ్‌లో తనిఖీలు చేస్తున్నామని సాల్వడార్ శాసనసభ్యుడు సాల్వడార్ చాకోన్ ట్విట్టర్‌లో తెలిపారు. నికరాగ్వా, హోండురాస్, గ్వాటెమాల, బెలిజ్‌లలో కూడా భూకంపం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.