Gleycy Correia Dies: మోడలింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం, సర్జరీ వికటించడంతో మాజీ సుందరి మృతి, రెండు నెలలు కోమాలోనే ఉండిపోయిన మాజీ మిస్ బ్రెజిల్ గ్లేసీ కొరియా
Former Miss Brazil Gleycy Correia (Photo-Instagram)

Brasília, June 23: మాజీ మిస్ బ్రెజిల్ గ్లేసీ కొరియా ఏప్రిల్‌లో తన టాన్సిల్స్‌ను తొలగించే సాధారణ ఆపరేషన్‌లో సంక్లిష్టత కారణంగా భారీ రక్తస్రావం మరియు గుండెపోటుతో (Gleycy Correia Dies) సోమవారం మరణించింది. సాధారణ సర్జరీ నుంచి కోటుకుంటున్న సమయంలో సీరియస్ అయి రెండు నెలలు కోమాలోకి వెళ్లిపోయింది. అయితే విధి వక్రీకరించడంతో తిరిగిరాని లోకాలకు (Former Miss Brazil Gleycy Correia dead) వెళ్లిపోయింది. దీంతో మోడలింగ్‌ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బ్రెజిల్‌ మాజీ సుందరి గ్లేసీ కొరియా, మోడల్‌‌, బ్యూటీషియన్. 2018లో ఆమె మిస్‌ బ్రెజిల్‌ కిరీటం గెల్చుకుంది. ఆ తర్వాత సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తోంది. అయితే.. గొంతు టాన్సిల్స్‌ తొలగించుకునేందుకు ఏప్రిల్‌ 4వ తేదీన ఆమె సాధారణ సర్జరీ ( tonsillectomy) చేయించుకుంది. నాలుగు రోజుల తర్వాత మెదడులో రక్తస్రావంతో పాటు గుండెపోటు వచ్చాయి. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు.

పాకిస్తాన్‌లో దారుణం, తుపాకీ గురిపెట్టి ఇద్దరు హిందూ యువతులపై గ్యాంగ్ రేప్, లాహోర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో దారుణం

ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లోనే రెండు నెలలపాటు కోమాలో ఉన్న ఆమె.. జూన్‌ 20వ తేదీన కన్నుమూసింది. రియో డీ జనెరియోకు ఈశాన్యంగా ఉండే మకాయే నగరంలో పుట్టి.. మోడలింగ్‌ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది కొర్రెయియా. ఒక సాధారణ గొంతు టాన్సిల్స్‌ సర్జరీకి ఆమె మృతి చెందడం.. ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.

బ్రెజిల్‌లో పేదరికంలో ఎదుగుతున్న తన జీవితం గురించిన వివరాలను ఆమె అంతకుముందు కొరియా సోషల్ మీడియాలో పంచుకుంది. పేదరికంతో బాధపడుతున్న తన కుటుంబాన్ని ఆదుకోవడానికి 8 సంవత్సరాల వయస్సులో ఆమె మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 52,000 కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉన్నారు, ఇక్కడ అభిమానులు ఆమె కెరీర్ , అందం చిట్కాలను అనుసరించారు.