భారత్‌లో జరిగిన జీ20 సదస్సు విజయవంతంగా ముగియగా, జీ20 అధ్యక్ష పీఠాన్ని బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో, ప్రపంచ నాయకులు అనేక ముఖ్యమైన నిర్ణయాలను ఆమోదించారు. వన్ ఫ్యూచర్ పేరుతో జరిగిన జీ20 చివరి సెషన్‌లో ప్రధాని మోదీ అధికారికంగా బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వాకు భారత జీ20 అధ్యక్ష పదవిని అందజేశారు. సాధారణ ఆచారంలో భాగంగా బ్రెజిల్ అధ్యక్షుడికి ప్రధాని హామర్ ను అందజేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు "G20ని సమర్థవంతంగా నడిపించినందుకు, ఈ శిఖరాగ్ర సమావేశంలో చాలా బిజీగా ఉన్నందుకు" ప్రధాని మోడీని అభినందించారు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలకు భారత్ కృషి చేస్తోందని ఆయన ప్రశంసించారు.
వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జీ20 సదస్సు జరగనుంది. బ్రెజిల్ తర్వాత, 2025లో దక్షిణాఫ్రికా G20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తుంది. అనంతరం 2026లో జీ20 అధ్యక్ష పీఠాన్ని అమెరికా కైవసం చేసుకుంటుందని వెల్లడించారు.
PM Modi announces conclusion of G20 Summit, proposes virtual review session in November
Read @ANI Story | https://t.co/iAKlQn9b8Z#G20SummitDelhi #G20India2023 #PMModi pic.twitter.com/0EamNX8wV2
— ANI Digital (@ani_digital) September 10, 2023
ఈ ఉదయం ప్రధాని మోదీ జీ20 దేశాధినేతలు, ఇతర అంతర్జాతీయ సంస్థల అధినేతలతో కలిసి రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, కొమొరోస్ యూనియన్ ప్రెసిడెంట్ మరియు ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) ప్రెసిడెంట్ అజాలీ అసోమానీ, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు, స్పానిష్ వైస్ ప్రెసిడెంట్ నాడియా కాల్వినో, యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్ ఎకనామిక్ మినిస్టర్ రాక్వెల్ బ్యూనోస్ట్రో సాంచెజ్ మహాత్ముడికి నివాళులర్పించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...