Alphabet.Inc ( Photo credits : Wikimedia Commons)

New Delhi, SEP 14: దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) గణనీయమైన తొలగింపులను ప్రకటించి ఉద్యోగులకు షాక్‌ (Alphabet lays off) ఇచ్చింది. గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్‌లో సిబ్బంది కోతలను అమలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దాదాపు వందలమందిని ఉద్యోగులను తొలగించనుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, క్లిష్టమైన స్థానాలను భర్తీ చేయడంపై దృష్టి పెట్టడానికి ఆల్ఫాబెట్ జట్టులోని మెజారిటీని నిలుపుకోవాలని భావిస్తోంది. జనవరిలో, ఆల్ఫాబెట్, సుమారు 12,000 ఉద్యోగాలను తొలగించింది. తద్వారా మొత్తం సిబ్బందిలో 6శాతం తగ్గించుకుంది.

Google Winter Internship 2024: ఈ అర్హతలుంటే నెలకు రూ.83 వేల జీతంతో గూగుల్ జాబ్, అప్లయి చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 1, గూగుల్ వింటర్ ఇంటర్న్‌షిప్ 2024 వివరాలు ఇవిగో.. 

తాజాగా నియామకాల్లో కొనసాగుతున్న మంద గమనంలో భాగంగా మరికొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. విస్తృత స్థాయి తొలగింపులు కానప్పటికీ కొన్ని కీలక ఉద్యోగాల ఎంపిక కోసం కొన్ని వందల మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను తగ్గించుకుంటున్న బిగ్ టెక్‌ సంస్థగా ఆల్ఫాబెట్ (Alphabet) నిలిచింది. మెటా, మైక్రోసాఫ్ట్ , అమెజాన్‌తో సహా ఇతర టెక్ దిగ్గజాలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.

Oxygen Generated on Mars: మార్స్‌ గ్రహంపై నాసా సంచలనం, కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే ప్రయోగం సక్సెస్ అయినట్లు ప్రకటన 

ఉపాధి సంస్థ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ నివేదికలు జూలైతో పోలిస్తే ఆగస్టులో యునైటెడ్ స్టేట్స్‌లో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరిగాయి. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని సూచిస్తున్నాయి. రాయిటర్స్ ఆర్థికవేత్తల సర్వేలో సెప్టెంబరు 9తో ముగిసే వారానికి రాష్ట్ర నిరుద్యోగ ప్రయోజనాల కొత్త క్లెయిమ్స్‌ సుమారుగా 8 శాతం పెరుగుదలను అంచనా వేశారు.