PM Modi Speech at Namaste Trump | ANI Photo

Ahmedabad, February 24: భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి రోజు అహ్మదాబాద్ నగరంలో పర్యటించారు. ఇక్కడ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్, ఆయన కోసం అతిపెద్ద మోతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ సభ 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసి డొనాల్డ్ ట్రంప్ ఉత్సాహంగా కనిపించారు.

వేలు లక్షల మందితో కిక్కించిపోయిన చేసిన మొతేరా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "నేను హౌడీ మోడీ ఈవెంట్‌తో నా అమెరికా పర్యటనను ప్రారంభించాను, ఈరోజు డొనాల్డ్ ట్రంప్ "నమస్తే ట్రంప్‌" ఈవెంట్‌తో తన చారిత్రాత్మక భారత పర్యటనను ప్రారంభించారు." భారత్- అమెరికా మైత్రికి సంబంధించి ఇదొక సరికొత్త అధ్యాయం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అమెరికా అధ్యక్షుడికి మనస్పూర్థిగా స్వాగతం పలుకుతోంది అని మోదీ అన్నారు.

"భారతదేశం-యుఎస్ సంబంధాలు ఇకపై మరొక భాగస్వామ్యం కాదు. ఇది చాలా గొప్ప మరియు దగ్గరి సంబంధం. ఒకటి 'స్వేచ్ఛా భూమి', మరొకటి ప్రపంచం ఒక కుటుంబం అని నమ్ముతుంది. ఒకరు 'స్టాచూ ఆఫ్ లిబర్టీ' గురించి గర్వంగా భావిస్తారు, మరొకరు భావిస్తారు 'స్టాచూ ఆఫ్ యూనిటీ' గురించి గర్వంగా చెప్పుకుంటారు. భారత్ - అమెరికా మైత్రి కలకాలం వర్ధిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.