Petrol Diesel Prices: అక్కడ లీటరు పెట్రోల్ ధర ఏకంగా 204 రూపాయలు, డీజిల్ 139 రూపాయలు, ఎక్కడో తెలిస్తే అవాక్కవుతారు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం దెబ్బ మామూలుగా లేదుగా..
Petrol Price In India | Representational Image | (Photo Credits: PTI)

కొలంబో, ఫిబ్రవరి 27: ఉక్రెయిన్ రాజధాని కీవ్ మిస్సైల్‌ దాడులతో అట్టుడుకుతోంది. ఉక్రెయిన్, రష్యా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ప్రధానంగా చమురు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. చమరు నిల్వలపై దృష్టి సారిస్తున్నాయి. అయితే.. శ్రీలంకలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఇంకా ఆహారం, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని విమర్శలు ఉన్నాయి. కరోనా కారణంగా పరిస్థితులు మరింత దిగజారాయి. విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకోవాలని దిగుమతులపై నిషేధం విధించింది. ధరలపై నియంత్రణ విధిస్తూ.. అత్యవసర నిబంధనలు ముందుకు తెచ్చింది. ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం చమురు సంస్థలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి.

Indians in Ukraine: భారతీయులు జాగ్రత్తగా ఉండండి, ఎవ‌రూ ఏ దేశ స‌రిహ‌ద్దుల వైపు వెళ్లొద్ద‌ు, హెచ్చరించిన ఉక్రెయిన్‌ ఎంబ‌సీ అధికారులు, ఉక్రెయిన్ నుంచి వ‌చ్చే విద్యార్థుల‌కు ముంబై ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు

శ్రీలంకలో పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లీటర్ పెట్రోల్ కు రూ. 20, లీటర్ డీజిల్ రూ. 15 పెంచడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. పెరిగిన ధరలతో ఇప్పుడు శ్రీలంకలో లీటర్ పెట్రోల్ రూ. 204, లీటర్ డీజిల్ ధర రూ. 139కి ఎగబాకింది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటడంతో చమురు కొనుగోళ్లు జరగలేదని ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఫలితంగా పెట్రోల్ పంపులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో శ్రీలంక వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.