Britain, FEB 29: బ్రిటన్ రాజ కుటుంబానికి (Britain Royal Family) సంబంధించి ఏ విషయాన్నైనా యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనిస్తుంది. తాజాగా యువరాణి కేట్ మిడిల్టన్ (Kate Middleton)పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్ నుంచి ఆమె కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఇటీవల పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్న కేట్.. కోమా(Coma)లోకి వెళ్లి ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. కేట్ మిడిల్టన్‌కు సర్జరీ అయిన విషయాన్ని ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరి 17న వెల్లడించింది. ఆ శస్త్రచికిత్స విజయవంతమైందని పేర్కొంది. 10 నుంచి 14 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని, అనంతరం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని తెలిపింది.
I am not trying to be a conspiracy theorist about the situation at all, but it is WILD how much the royal family has shut down press about where Kate Middleton is/why she hasn't been seen.
— Sophia Benoit (@1followernodad) February 19, 2024
అయితే అప్పటినుంచి యువరాణి బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం తాజా వదంతులకు కారణమైంది. సర్జరీ సమయంలో యువరాణికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి. తొలుత వీటిని ఓ స్పానిష్ టీవీ జర్నలిస్టు కొంచా కల్లెజా (Concha Calleja) వెల్లడించారు. అయితే, ఆమె ప్రకటనను బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలేనని పేర్కొంటున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం కేట్ కనిపించకుండా పోయారనే వార్తలు ఆగడం లేదు. ఆమె భర్త ప్రిన్స్ విలియం ఇటీవల పలు కార్యక్రమాల్లో ఒక్కరే పాల్గొనడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.
How are we all expected to “work” when we don’t even know where Kate Middleton is pic.twitter.com/YM5KhTXNdp
— Sam Stryker (@sbstryker) February 27, 2024
ఇదిలాఉంటే, బ్రిటన్ రాజు ఛార్లెస్-3 (King Charles-III )కి క్యాన్సర్ నిర్ధరణ అయిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఇటీవల వెల్లడించింది. దీంతో ఆయనకు చికిత్స నడుస్తోందని తెలిపింది. వేల్స్ యువరాణి కేట్ (Kate Middleton)కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు చేరినట్లు సమాచారం. ఇలా కేట్ త్వరలోనే ప్రజల ముందుకువస్తారని రాజకుటుంబ వర్గాలు చెబుతుండగా.. ఆమె పూర్తిగా కోలుకోవడానికి దాదాపు తొమ్మిది నెలలు పట్టవచ్చని బ్రిటన్ మీడియా పేర్కొంటోంది.