Abrahamic New Religion: 4,200కు పైగా మతాలు ప్రాచుర్యంలో ఉన్న ప్రపంచంలోకి మరో కొత్త మతం.. పేరు ‘అబ్రహామిక్‌’.. 3 మతాల కలయికతో ఏర్పడిన కొత్త మతం ఇది.. దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే?
Abrahamic (Credits: Google)

Newdelhi, Apr 21: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 4,200కు పైగా మతాలు (Religions) ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొత్త మతం ఒకటి వచ్చిచేరింది. దీనికి ‘అబ్రహామిక్‌’గా (Abrahamic) నామకరణం చేశారు. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం కలయికతో ఈ మతాన్ని ఏర్పాటు చేశారు. 2020లో యూఏఈ, బహ్రెయిన్‌, ఇజ్రాయెల్‌ దేశాలు ఓ ఒడంబడిక చేసుకొన్నాయి. అప్పుడే ఈ మతం పేరు తొలిసారిగా చర్చకు వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రోద్బలంతో ఈ ఒడంబడిక తెరమీదకు వచ్చింది. దీన్ని ఆయన ‘అబ్రహామియన్‌ ఒప్పందం’గా అభివర్ణించారు.

IPL 2024, SRH vs DC : హైదరాబాద్ సృష్టించిన పరుగుల వరదలో కొట్టుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, 67 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలుపు

ఎందుకు తీసుకొచ్చారంటే?

వివిధ మతాల మధ్య ఉన్న పరస్పర భేదాలను తొలగించి, ప్రపంచ శాంతి స్థాపనకే ఈ మతాన్ని తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. ఇంతకీ ఈ మతానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే.. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల్లో అబ్రహంను మొదటి ప్రవక్తగా గుర్తిస్తారు. ఈ మూడు మతాల కలయికతో ఏర్పడటం వల్ల ఆ ప్రవక్త పేరు వచ్చేలా ఈ మతానికి ‘అబ్రహామిక్’ అని నామకరణం చేశారు.