WELLINGTON January 23: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో జనాల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చాలా దేశాల్లో ప్రజలు అత్యవసర పనులు, ప్రయాణాలు మినహా ఏవీ చేయడం లేదు. ఇక కొన్నిచోట్ల వివాహాలు, శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు. వేలాది పెళ్లిల్లు పోస్ట్ పోన్ అయ్యాయి. పెళ్లి నిలిచిపోయిన వారి లిస్ట్ లో న్యూజిలాండ్ ప్రధాని (New Zealand PM ) కూడా చేరారు.
కరోనా కొత్త వేరియంట్ విజృంభణ కారణంగా న్యూజిలాండ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు (Corona ristrictions) విధించింది. ఒమిక్రాన్ ఆంక్షలు.. ఆ దేశ ప్రధానమంత్రి జసిందా అర్డర్న్(Jacinda Ardern ) పెళ్లికి అడ్డొచ్చాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రధాని జెసిందా ప్రకటించారు.
క్లార్క్ గేఫోర్డ్(Clarke Gayford ), జెసిందా(Jacinda) ఇద్దరు స్నేహితులు. ఇప్పటికే జెసిందా, గేఫోర్డ్ కరోనా కారణంగా పలుమార్లు తమ పెళ్లిని వాయిదా(cancels her wedding) వేసుకున్నారు. తాజాగా కరోనా ఆంక్షల నేపథ్యంలో మరోసారి తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం వివాహ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.
ప్రధాని జెసిందా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాతో ఇబ్బందులను అనుభవిస్తున్నవారిలో తాను కూడా చేరానని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందని దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.