Stranded Indian From Sudan. (Photo Credits: Twitter@MOS_MEA)

New Delhi, April 26: సుడాన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మూడో బ్యాచ్‌ను కూడా సుడాన్ నుంచి (Indians Leaves Sudan) బయల్దేరింది. 135 మంది భారతీయులను తీసుకువస్తున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సుడాన్ నుంచి జెడ్డాకు బయల్దేరింది. ఈ మేరకు విదేశీవ్యవహారాల సహాయమంత్రి వి. మురళీధరన్ ట్వీట్ చేశారు. సుడాన్‌ లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఆపరేషన్ కావేరి (Operation Kaveri) పేరుతో చర్యలు చేపట్టింది.

ఇప్పటికే 148 మందితో సుడాన్ నుంచి వచ్చిన బృందాన్ని కేంద్రమంత్రి మురళీధరన్ (V Muraleedharan) రిసీవ్ చేసుకున్నారు. మరో 278 మందిని సముద్రమార్గం ద్వారా తీసుకువచ్చేందుకు ఐఎన్‌ఎస్ సుమేధ ద్వారా ఏర్పాట్లు చేశారు. మరో 135 మందిని తాజాగా ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ లో తీసుకువస్తున్నారు. సుడాన్‌లో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణల్లో వందలాది మరణిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

S Jaishankar Hits Hard At Pakistan:సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే పొరుగు దేశాలతో మసులుకోవడం కష్టమే.. ఆ దేశం మారుతుందని ఆశిస్తున్నాం.. పాక్ కు జైశంకర్ చురకలు.. పనామాలో మీడియాతో విదేశాంగ మంత్రి (వీడియోతో) 

దీంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి చేపట్టింది. సుడాన్ లో చిక్కుకున్న వందలాది భారతీయులను సురక్షితంగా వెనక్కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. విదేశాంగవ్యవహారాల శాఖ ఈ మేరకు సుడాన్ తో పాటూ సరిహద్దు దేశాలతో సమన్వయం చేసుకుంటుంది. ప్రత్యేక విమానాలు, వీలైన అన్ని మార్గాల ద్వారా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది.