Lahor, July 19: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న బస్సును పంజాబ్‌లోని డేరా ఘూజీఖాన్ రహదారిపై ఓ ట్రక్ (Pakistan Road Accident) ఢీకొట్టింది. ఈ ఘటనలో ముఫ్పై మంది దుర్మరణం చెందారు. మరో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బుధవారం జరగనున్న ఈద్ ఉల్ అజాను జరుపుకునేందుకు కూలీలు (labourers) స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం (bus crashes into truck) జరిగినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు కూడాఉన్నారు.
సియాల్‌కోట్ నుంచి రాజన్‌పూర్ (Sialkot to Rajanpur) వెళుతుండగా ఇండస్ హైవే పై ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది కూలీలే ఉన్నారు. పాకిస్థాన్ సమాచార ప్రసారశాఖ మంత్రి ఫవద్ చౌదరి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బస్సు డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దర్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ అధికారులకు సూచనలు చేస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ముజఫ్పర్‌గఢ్‌లోని డేరా ఘాజీ ఖాన్ (Dera Ghazi Khan district) వద్ద ఇండస్ హైవేపై ప్రైవేట్ బస్సు-కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 30 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. బక్రీద్ పండుగ సందర్భంగా సొంతూర్లకు ప్రయాణమైన కార్మికులు సియాల్‌కోట్ నుంచి రజన్‌పూర్ కు ప్రైవేట్ బస్సులో ప్రయాణమయ్యారు. మరో గంటన్నరలో ఇంటికి చేరుతారనగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
వీరంతంగా సియాల్‌కోట్‌లో దినసరి కార్మికులుగా పనిచేస్తున్నారు. బక్రీద్‌ను ఇంటి వద్ద జరుపుకునేందుకు బయల్దేరగా ఈ ప్రమాదానికి గురయ్యారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని పోలీసులు బయటకు తీసి దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని డేరా ఘాజీ ఖాన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.