Lahore, March 10: భారత్ పై (India) సంచలన ఆరోపణలు చేసింది దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan). తమ దేశ వాయుతలంలోకి భారత్ అక్రమంగా ప్రవేశించిందని ఆరోపించింది. పంజాబ్ ఫ్రావిన్స్ లో భారత్ కు చెందిన ఓ శకలం లభ్యమైనట్లు ప్రకటించారు పాకిస్తాన్ అంతర్గత ప్రజా సంబంధాల వ్యవహారాల డైరక్టర్ జనరల్ బాబర్ ఇఫ్తికర్(Babar Iftikhar). పంజాబ్ ఫ్రావిన్స్ లోని మైన్ చన్ను ప్రాంతంలో స్పీడ్ దూసుకువచ్చిన ఓ వస్తువు పడిపోయిందని (High Speed Flying Object) తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ ఇళ్లు కూడా ద్వంసమైందని, అయితే ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. భారత్ తమ అనుమతి లేకుండా గగనతలంలోకి ప్రవేశించిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి అంతర్గత విచారణ జరుపుతున్నట్లు బాబర్ ప్రకటించారు.

అయితే ఇది సూపర్ సోనిక్ మిసైల్ అయి ఉండొచ్చని, కానీ అందులో మందుగుండు లేకుండా ప్రయోగించి ఉంటారని పాక్ భావిస్తోంది. మార్చి 9న సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని బాబర్ తెలిపారు. దీనిపై ధృవీకరణ చేసుకున్న తర్వాత ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు.

Ukrainian President Zelensky Compromise: రష్యాతో రాజీకి సిద్ధమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, నాటో చేరేది లేదని ప్రకటన, మెత్త బడ్డ పుతిన్, 14 రోజుల యుద్ధం ముగింపునకు వచ్చే అవకాశం..

దీనిపై ఇండియా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తొలుత పాక్ చానెళ్లలో ఈ ఘటనకు సంబంధించి వేరే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వక్రీకరించి భారత్ (India) పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది. పంజాబ్ ఫ్రావిన్స్ సమీపంలో శిక్షణ విమానం కూలిపోయిందని, ఇందులో ఎవరూ గాయపడలేదని పాక్ చానెళ్లు చెప్పాయి. కానీ ఒకరోజు తర్వాత పాక్ ప్లేట్ ఫిరాయించింది.