ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి దౌత్యపరంగా పెద్ద షాక్ తగిలింది. సెర్బియాలో ఉన్న పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలోని సిబ్బందికి ఇమ్రాన్ సర్కారు జీతాలు చెల్లించలేదని ట్విట్టర్ లో పేర్కొంది. ఈ ట్వీట్ లో పాకిస్తాన్ సర్కారును నయా పాకిస్థాన్' మోడల్ అంటూ ప్రశ్నించింది. ఎంబసీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఫీజు చెల్లించకపోవడంతో వారి పిల్లలు బలవంతంగా పాఠశాల నుండి బయటికి వెళ్లారని పోస్ట్‌లో పేర్కొంది. 'ఆప్ నే ఘబ్రానా నహీ' (మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు) అంటూ పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యపై ఆ పోస్ట్‌లో వీడియో కూడా ఉంది.
యీద్ అలెవి అధికారి వాటర్‌మార్క్‌తో రూపొందించిన వీడియోలో పాకిస్తాన్ వినాశన పథంలోకి వెళ్తోందని తెలిపింది. అయితే ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని అందువల్లనే ఈ ట్వీట్ బయటకు వచ్చిందని పాకిస్తాన్ పేర్కొంది.
పాకిస్తాన్ ద్రవ్యోల్బణం రేటు 11.5 శాతంగా ఉంది, ఇది గత 20 నెలల్లో దేశంలోనే అత్యధికం. ఫలితంగా, పాకిస్తాన్‌లోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పండ్లు, కూరగాయలు మరియు మాంసం ధరలు విపరీతంగా పెరిగాయి.
ఈ ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే డిలీట్ చేయబడింది.