Image used for representational purposes only (Photo Credits: Pixabay)

Lahore, OCT 05: పాకిస్తాన్‌లోని పోయిట్ రెస్టారెంట్‌లో (Poet Restaurant) దారుణం జ‌రిగింది. మేనేజర్ నిర్లక్ష్యపూరిత వ్యవహారశైలితో కస్టమర్ల ప్రాణాల మీదకు వచ్చింది. బర్త్ డే పార్టీ (Birthday party) కోసం వచ్చిన పలువురి చేతులు పూర్తిగా కాలిపోయాయి. పుట్టినరోజు వేడుకల్లో వాట‌ర్ బాటిల్స్‌కు బ‌దులుగా యాసిడ్ బాటిల్స్‌ను (acid bottles) పంపిణీ చేశారు. ఆ బాటిల్స్‌తో చేతులు క‌డుక్కున్న ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మ‌రో అమ్మాయి నోరు కాలిపోయింది. ఈ ఘటన ఆల‌స్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబ‌ర్ 27న మ‌హ్మ‌ద్ అదిల్ కుటుంబంలో ఒక‌రి బ‌ర్త్‌డే పార్టీని పోయిట్ రెస్టారెంట్‌లో నిర్వ‌హించారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు నీళ్ల బాటిల్స్‌కు (water bottles) బ‌దులుగా యాసిడ్ బాటిల్స్‌ను పంపిణీ చేశారు.

Iran: పోలీసులతో విద్యార్థుల ఫైటింగ్, కాల్పులు జరిపిన పోలీసులు, ఇరాక్‌లో యువతి పోలీసు కస్టడీలో మరణించడంతో హోరెత్తుతున్న నిరసనలు 

బాటిల్స్‌లో నీళ్లు ఉన్నాయ‌కున్న పిల్ల‌లిద్ద‌రూ ఒక‌రు చేతులు క‌డుక్కోగా, మ‌రొక‌రు నోట్లో పోసుకున్నారు. దీంతో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిద్ద‌రిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  మ‌హ్మ‌ద్ అదిల్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. రెస్టారెంట్ య‌జ‌మానిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.

US: యుఎస్‌లో 8 నెలల చిన్నారి సహా నలుగురు భారతీయులు కిడ్నాప్, అత‌ను ప్రమాదకరమైనవాడని తెలిపిన పోలీసులు 

అయితే ఈ మొత్తం వ్యవహారంలో పొయట్ మెనేజర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అతను కనీసం బాధ్యతగా వ్యవహరించకుండా యాసిడ్ బాటిల్స్ ను అందించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి చాలా రోజుల వరకు వార్త బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ బాధితుల పరిస్థితి విషమించడంతో స్థానిక మీడియా కథనాన్నిప్రచురించింది.