Rishi Sunak. (Photo Credits: Twitter)

Britain, July 21: బ్రిటన్ ప్రధాని (Britain PM) పదవి రేసులో అడుగుదూరంలో నిలిచారు రిషి సునాక్ (Rishi Sunak). భారత సంతతికి చెందిన రిషి.. ఈ పదవి కోసం జరుగుతున్న పోటీల్లో తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. చరిత్రలో తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని కానున్నారు. అడుగు దూరంలో నిలిచిన రిషి ఐదో రౌండ్‌లో 137 మంది ఎంపీల మద్దతుతో రిషి మొదటి స్థానం సంపాదించారు. చివరకు రిషి, లిజ్‌ ట్రస్ (Liz Truss ) మాత్రమే పోటీలో మిగిలారు. రిషికి గట్టి పోటీ ఇస్తుందని భావించిన పెన్నీ మోర్డెంట్ (Penny Mordaunt) ఎలిమినేషన్ తో సరిపెట్టుకున్నారు. రిషికి లిడ్‌ ట్రస్‌తో హోరాహోరీ పోరు ఉండనుంది.

Ranil Wickremesinghe: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే, గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక  

కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) సభ్యులు ట్రస్‌వైపే మొగ్గుచూపే అవకాశాలు కూడా లేకపోలేదు. రిషి సోమవారం బీబీసీ ఛానెల్‌లో డిబేట్‌లో పాల్గొనడంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరై మద్దతు కూడగట్టుకోనున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి (Conservative Party) చెందిన లక్షా 60 వేల మంది సభ్యుల్లో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే బ్రిటన్ ప్రధాని పీఠం అధిరోహించనున్నారు.

Pakistan Shocker: పాకిస్తాన్‌లో దారుణం, హోటల్లో నిర్బంధించి అమెరికా యువతిపై గ్యాంగ్ రేప్, ఆపై సామూహిక అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరింపులు  

సెప్టెంబర్ 5న జరిగే బ్యాలెట్ ఓటింగ్ (Ballot voting) మరింత మందిని తన వైపు తిప్పుకుంటే రిషి విజయం సునాయాసంగా మారిపోతుంది. బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర లిఖిస్తారు.