మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్య 115కి చేరుకుందని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కమిటీ శనివారం తెలిపిందని సిఎన్ఎన్ వార్తా సంస్థకు నివేదించింది. మాస్కో సమీపంలోని క్రోకస్ కాంప్లెక్స్‌పై శుక్రవారం జరిగిన దాడికి సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బి) డైరెక్టర్ అలెగ్జాండర్ బోర్ట్‌నికోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తెలిపారు. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు” అని తెలిపారు.
ఉగ్ర దాడి వివరాల్లోకి వెళితే..రష్యాలోని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఓ షాపింగ్ మాల్లోని మ్యూజిక్ కాన్సర్ట్లో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 60 మంది చనిపోయారు. కాన్సర్ట్ హాల్లోకి చొరబడ్డ తీవ్రవాదులు కనిపించిన వారందరినీ తుపాకులతో పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్ (ISIS) ప్రకటించింది.
ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా తప్పుబట్టారు: “మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆలోచనలు మరియు ప్రార్థనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి మరియు ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందని పేర్కొన్నారు. UK విదేశాంగ కార్యదర్శి డేవిడ్ కామెరూన్ మాట్లాడుతూ, "మేము మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము మరియు అనేక మంది బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. అమెరికా ఈ దాడిని "భయంకరమైన సంఘటన"గా అభివర్ణిస్తూ ఖండించింది.
MLC Kavitha Arrest: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువుల ఇళ్లపై ...