Russia, June 22; నోబెల్ శాంతి బహుమతి వేలంలో (Nobel Auction) రికార్డులు సృష్టించింది. రష్యా జర్నలిస్టు దిమిత్రి మురతోవ్ (Dmitry Muratov)ఆ ప్రైజ్‌ను వేలం వేశారు. నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace prize) సుమారు 800 కోట్ల(103 మిలియన్ డాలర్స్)కు అమ్ముడుపోయింది. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం (children displaced by the war ) ఈ వేలం సోమవారం జరిగింది. గతంలో నోబెల్ వేలం రికార్డులు ఈ సారి బద్దలయ్యాయి. 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబెల్ బహుమతిని అమ్మారు. 1962లో గెలిచిన ఆ బహుమతికి అప్పట్లో అత్యధికంగా 4.76 మిలియన్ల డాలర్లు వచ్చాయి. అక్టోబర్ 2021లో మురతోవ్‌కు అవార్డు దక్కింది. రష్యాలో స్వతంత్య్ర పత్రిక నొవాయా గెజిటాను ఆయన స్థాపించారు. ఎడిటర్ ఇన్ చీఫ్‌గా చేశారు. అయితే మార్చిలో ఆ పత్రికను మూసివేశారు. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా తమ దేశంలోని జర్నలిస్టులపై కొరఢా రుళిపించిన విషయం తెలిసిందే.
ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం నోబెల్ శాంతి (Nobel peace prize) బహుమతిని వేలం వేయాలని మురతోవ్ నిశ్చయించారు. 5 లక్షల డాలర్ల క్యాష్ అవార్డును కూడా ఆయన ఛారిటీకి ఇచ్చేశారు. శరణార్థి పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
వేలంలో వచ్చిన సొమ్ము నేరుగా యునిసెఫ్ (Unicef)అకౌంట్‌లోకి వెళ్తుందని, ఆ సంస్థ ఉక్రెయిన్ పిల్లలకు ఖర్చు చేస్తుందని మురతోవ్ అన్నారు. మురతోవ్‌కు ఇచ్చిన నోబెల్ ప్రైజ్‌లో 23 క్యారెట్లకు చెందిన 175 గ్రాములు బంగారం ఉంటుంది. గత ఏడాది పిలిప్పీన్స్ జర్నలిస్టు మారియా రీసాతో పాటు మురతోవ్ నోబెల్ పీస్ ప్రైజ్‌ను షేర్ చేసుకున్నారు.