Moscow, March 13: రష్యాలో సైనిక విమానం (Russia Plane Crash) కుప్పకూలింది. రష్యా సైన్యానికి చెందిన ఐఎల్-76 రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవోలో (Russia Plane Crash) కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించి రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు కోసం హుటాహుటిన మిలిటరీ కమిషన్‌ను ఇవనోవో ఎయిర్‌బేస్‌కు పంపినట్లు తెలిపింది.
BREAKING: Large Russian military plane crashes near Ivanovo, northeast of Moscow pic.twitter.com/di4pnpJxKh
— BNO News (@BNONews) March 12, 2024
కాగా, గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతుండటంతో రష్యాలో సైనికులు, సైనిక సామాగ్రి రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇరుదేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్ తమ ఐఎల్-76 సైనిక విమానాన్ని కూల్చేసిందని రష్యా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.