South Sudan, DEC 15: దక్షిణ సూడాన్ అధ్యక్షుడు (South Sudan President) చేసిన పని ఆ దేశ ప్రజలతోపాటు, ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. దక్షిణ సూడాన్ అధ్యక్షుడు సాల్వా కిర్ మయర్దిత్ (Salva Kiir Mayardit) 2011 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. అయితే, ఆయన చేసిన ఒక పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల దక్షిణ సూడాన్‌లో ఒక అధికారిక కార్యక్రమం జరిగింది. దీనికి అక్కడి సైన్యం, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారీ స్థాయిలో ఈ కార్యక్రమం జరిగింది. అనేక టీవీ ఛానెళ్లు దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. కార్యక్రమంలో భాగంగా సైనిక వందన కార్యక్రమం జరుగుతోంది. అందరూ సెల్యూట్ చేస్తుండగా, అధ్యక్షుడు సాల్వా మధ్యలో నిలబడి సైనిక వందనం (recitation of the national anthem) స్వీకరిస్తున్నాడు. అయితే, ఈ సమయంలో ఆయన ఉన్నట్లుండి మూత్రం పోసుకున్నాడు (Peeing). తన ప్యాంట్‌లోంచి మూత్రం కిందికి కారిపోయింది. ఆయనకు తెలియకుండానే ఇదంతా జరిగింది.
View this post on Instagram
అక్కడున్న వాళ్లు ఇదంతా షాకై చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటన టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ (Live telecast) అయ్యింది. దీంతో ఈ అంశం దక్షిణ సూడాన్‌తో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ విషయంలో చాలా మంది భిన్నంగా స్పందిస్తున్నారు.
ఆయన వయసు పైబడటం వల్ల ఇలా జరిగిందని కొందరు అంటే, ఇంకొందరు మాత్రం ఒక దేశ అధ్యక్షుడై ఉండి అలా చేస్తాడా అంటూ విమర్శిస్తున్నారు. అయితే, సాల్వా కొంతకాలంగా మూత్ర సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అందువల్లే ఆయనకు తెలియకుండానే ఇది జరిగిందని అధికారులు తెలిపారు.