NASA astronauts Sunita Williams and Barry Butch Wilmore. (Photo credits: X/@NASA)

Washington, SEP 14:  బోయింగ్‌ సంస్థ ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన స్టార్‌లైనర్‌ స్పేస్‌ మిషన్‌ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams)‌, బుచ్‌ విల్‌మోర్‌ (Butch Wilmore) ఐఎస్‌ఎస్‌కు (International Space Station) చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో వ్యోమగాములు అంతరక్షింలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వారు స్పేస్‌ (Vote From Space) నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు (Vote from space) సిద్ధమయ్యారు.

New Virus Discovered In China: చైనాలో మ‌రో ప్రాణాంత‌ర వైర‌స్ గుర్తింపు, నాడీ వ్య‌వ‌స్థ‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న వైర‌స్, మంగోలియాలో ప‌లువురిలో వైర‌స్ న‌మూనాలు 

సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌ తాజాగా స్పేస్‌ నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రస్తావించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఐఎస్‌ఎస్‌ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమన్నారు. బ్యాలెట్‌ కోసం తమ అభ్యర్థనను నాసాకు (NASA) పంపామని.. ఇందుకు నాసా సహకరిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Is Putin Seeking Immortality? మరణించకుండా ఉండేందుకు మందు తయారు చేసే పనిలో పుతిన్, అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని అభివృద్ది చేయాలని ఆ దేశ శాస్త్రవేత్తలకు ఆదేశాలు 

ఇదిలా ఉండగా.. సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్‌మోర్‌లను ఐఎస్‌ఎస్‌ వద్దే వదిలేసి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక భూమిపైకి చేరుకుంది. వ్యోమగాములు లేని ఖాళీ స్పేస్‌క్రాఫ్ట్‌ వారం రోజుల క్రితం న్యూమెక్సికోలో దిగింది. ఇక సెప్టెంబర్‌లో ‘నాసా’ స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ‘డ్రాగన్‌’ రాకెట్‌ను పంపేందుకు సిద్ధమవుతున్నది. ఫిబ్రవరిలో చేపట్టే తిరుగు ప్రయాణంలో సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌ భూమి మీదకు చేరుకుంటారని తెలిసింది.