Twins Born On Different Days (PIC @ Facebook)

Texas, JAN 07: కవల పిల్లలు (Twins) కొన్ని నిమిషాల తేడాతో వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వింత సంఘటన జరిగింది. కాలీ జో, క్లిఫ్ జంటకు అరుదైన సమయంలో కవల పాపలు (Twin babies) పుట్టారు. 2022 డిసెంబర్‌ 31న రాత్రి 11.55 గంటలకు మొదటి పాప అన్నీ జోకు కాలీ జో జన్మనిచ్చింది. అనంతరం కొత్త ఏడాది జనవరి 1న 12.01 గంటలకు ఈఫీ రోజ్ స్కాట్‌ అనే రెండో పాప పుట్టింది. కాగా, ఆరు నిమిషాల తేడాతో వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లో కవల పిల్లలు పుట్టడంపై కాలీ జో, క్లిఫ్ (Cliff and I) జంట ఆనందానికి అంతులేకుండా పోయింది. తమ సంతోషాన్ని ఫేస్‌బుక్‌లో వారు పంచుకున్నారు.

Doctor Saves Man's Life: విమానంలో ప్రయాణికుడికి వెంటవెంటనే రెండు సార్లు గుండెపోటు, రెండు గంటల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన భారత సంతతి వైద్యుడు విశ్వరాజ్‌ వేమల 

‘అన్నీ జో, ఈఫీ రోజ్ స్కాట్‌లను పరిచయం చేయడం నేను, క్లిఫ్ చాలా గర్వంగా ఫీలవుతున్నాం’ అని కాలీ జో పేర్కొంది. 2022 డిసెంబర్‌ 31న రాత్రి 11:55 గంటలకు జన్మించిన చివరి పాప అన్నీ అని, 2023 జనవరి 1న ఉదయం 12:01 గంటలకు మొట్టమొదటిసారిగా జన్మించిన పాప ఈఫీ రోజ్‌ అని కాలీ జో తెలిపింది. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, 5.5 పౌండ్లు బరువు ఉన్నట్లు వెల్లడించింది. అరుదైన సమయంలో కవలలకు జన్మనివ్వడం తమకు చాలా ఆశ్చర్యంగాను, చాలా సంతోషంగా ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ఆమె పేర్కొంది.