Pakistan Prime Minister Imran Khan (Photo- facebook)

Islamabad, March 20: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan) స్వరం ఒక్కసారిగా మారింది. పదవి కిందకు నీళ్లొచ్చేసరికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తత్వం బోధపడినట్లుంది. తన తత్వానికి భిన్నంగా భారత్‌పై (India) ప్రశంసల వర్షం కురిపించారు. మలాఖండ్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్‌ భారత్‌ను ఆకాశానికి ఎత్తేశారు (Imran Khan's Praise India). ఐ సెల్యూట్‌ ఇండియా అంటూ ఎవరూ ఊహించని విధంగా మాట్లాడారు. భారత్‌ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానం అవలంభిస్తోందని అన్నారు. ఆ విదేశాంగ విధానం (Foreign Policy) ప్రజలకు మేలు చేసేలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేకూరేలా ప్రభుత్వాలు పనిచేస్తాయన్నారు.  దీంతో పరోక్షంగా పాక్ సైన్యం అధికార దుర్వినియోగాన్ని ప్రస్తావించారు ఇమ్రాన్.

Ex-Student Stabs Teacher: 30 ఏళ్ల క్రితం అవమానించినందుకు టీచర్‌ ను చంపేసిన స్టూడెంట్, 101 కత్తిపోట్లు పొడిచి కిరాతకంగా హతమార్చిన విద్యార్ధి, 16 నెలల పాటూ గాలించి పట్టుకున్న బెల్జియం పోలీసులు

రష్యా నుంచి భారత్‌ ఆయిల్‌ (Oil) కొనుగోలు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. క్వాడ్‌లో (QUAD ) భారత్‌ సభ్యదేశమైనా రష్యా నుంచి ఆయిల్‌ కొంటోందని ఇది ఆ దేశ ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు. అదే సమయంలో భారత్ సైన్యంపైనా ఆయన ప్రశంసలు గుప్పించారు.

Nobel for Ukraine President: ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి! యుక్రెయిన్ అధ్యక్షుడి పేరును ప్రతిపాదించిన యూరోపియన్‌ యూనియన్‌, జెలెన్‌ స్కీ కోసం నామినేషన్ తేదీ పొడిగించాలని డిమాండ్

భారత సైన్యం ఎప్పుడూ ప్రభుత్వంలో జోక్యం చేసుకోదన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ పదవికి గండం ఏర్పడే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. పదవి నుంచి దిగిపోవాలంటూ ఇమ్రాన్‌ఖాన్‌కు పాక్‌ సైన్యం అల్టిమేటమ్‌ ఇచ్చిందన్న సమయంలో ఆయన భారత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పాక్‌ పాలకులు ఎవరూ భారత్‌పై ప్రశంసలు కురిపించరు. బహిరంగంగా అయితే అసలు చేయరు. అయితే ఇమ్రాన్‌ నేరుగా ఓ ర్యాలీలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పాక్‌లో కలకలం రేపుతోంది.