Tonga January 15: పసిఫిక్ దీవుల్లో (South Pacific) సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. టోంగా (Tonga ) దీవీలో అగ్నిపర్వతం పేలడంతో పసిఫిక్ సముద్రంలో అలలు ఎగిసిపడ్డాయి. విస్పోటనంతో బూడిద బయటకు వచ్చింది. వాయువులు 20 కిలోమీటర్ల మేర వ్యాపించాయి. అలల మాదిరిగా అగ్నిపర్వతం (giant volcano) బద్దలు కాగా, నలుపురంగులో అది స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Tonga's Hunga Tonga volcano just had one of the most violent volcano eruptions ever captured on satellite. pic.twitter.com/M2D2j52gNn
— US StormWatch (@US_Stormwatch) January 15, 2022
టోంగా నగరానికి 65 కిలో మీటర్ల దూరంలో ఈ అగ్నిపర్వతం పేలుడు సంభవించింది. అగ్నిపర్వతం(giant volcano)గత నెల 20వ తేదీ నుంచి యాక్టివ్‌గా ఉండి.. జనవరి 11వ తేదీ నుంచి క్రమంగా కదిలింది. అదీ శుక్రవారం 14వ తేదీ విస్పోటనం చెందింది. విస్పోటనం కలుగడంతో టోంగాలో సునామీ(Tsunami ) హెచ్చరికలు జారీచేశారు. హుంగా, టోంగా, హుంగాలో ప్రభావం ఉంటుందని తెలిపారు. అలలు భారీగా ఎగసిపడ్డాయి. మూడు అలలతో రోడ్డు మీద నుంచి తోటలోకి వచ్చిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీంతో అధికారులు స్థానికులకు ఖాళీ చేయిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.