ఉక్రెయిన్ - రష్యా వార్ కు ఒక ముగింపు దొరికినట్లే కనపడుతుంది. గత నాలుగురోజులుగా జరుగుతున్న యుద్ధానికి స్వస్తి పలికేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. రష్యాతో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకరించారు. బెలారస్ లో జరిగే చర్చలకు తాము వస్తామని ప్రకటించడంతో చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇప్పటి వరకూ రష్యా చర్చలకు పిలిచినా ఉక్రెయిన్ ససేమిరా అనింది. ఆయుధాలు వీడి చర్చలకు రావాలన్న రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ పలుమార్లు తోసిపుచ్చింది. రష్యా పెట్టిన కొన్ని షరతులకు కూడా ఉక్రెయిన్ అంగీకరించింది. చర్చల కోసం ఇప్పటికే ఉక్రెయిన్ అధికారుల బృందం బెలారస్ బయలుదేరి వెళ్లింది. చర్చలు ప్రారంభమై యుద్ధం ముగిసినట్లయితే కేవలం ఉక్రెయిన్ ప్రజలే కాదు. ప్రపంచ దేశాలు కూడా ఊపిరి పీల్చుకుంటాయి.