Newyork, Feb 2: ఉద్యోగాలు (Jobs), వ్యాపారాల (Business) కోసం అమెరికాకు (America) వెళ్లాలని భావిస్తున్నవారికి అగ్రరాజ్యం ఊహించని ఝలక్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5(EB-5) లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 460 డాలర్లుగా ఉన్న హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజును 780 డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికా వెల్లడించింది.2016 తర్వాత అమెరికా వీసా ఫీజులు పెరగడం ఇదే తొలిసారి. కొత్త వీసా ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బైడెన్ సర్కారు స్పష్టం చేసింది.
USCIS Significantly Raises H-1B Visa And Immigration Fees https://t.co/qfE5iwfh17
— Forbes (@Forbes) February 1, 2024
మిగతా వీసా ఫీజుల పెంపు ఇలా..
- అమెరికాలోని ఎంఎన్ సీల్లో విదేశీ ఉద్యోగుల అంతర్గత బదిలీకి వీలు కల్పించే ఎల్-1 వీసా ఫీజును 460 నుంచి 1,385 డాలర్లకు పెంచారు.
- విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే ఈబీ-5 వీసా ఫీజును 3,675 నుంచి 11,160 డాలర్లకు పెంచారు.
- హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ఫీజును 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంపుదల చేశారు.