Newyork, Sep 23: మరో 45 రోజుల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Presidential Election 2024) గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమొక్రాటిక్ అభ్యర్థి , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తమ శక్తినంతా ధారపోస్తునారు. ఈ క్రమంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో తానుగనుక ఓడిపోతే అమెరికా అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి పోటీ చేయనని ట్రంప్ అన్నారు. వరుసగా మూడోసారి విజయం సాధించకపోతే 4 ఏళ్ల తర్వాత మళ్లీ వైట్ హౌస్ రేసులో పాల్గొంటారా అని ట్రంప్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ "లేదు, నేను పోరాడను" అని అన్నారు. కాగా, కమలా హారిస్ పై ట్రంప్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఇద్దరు నేతల మధ్య హోరాహోరీ పోటీ నెలకొందని సర్వేలు చెబుతున్నాయి. హారిస్ కూడా దేశవ్యాప్తంగా ఎన్నికలలో ముందంజలో ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
గాజాలో స్కూల్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ సైన్యం, ఏడుగురు మృతి, భీతావహంగా దృశ్యాలు
ఆరోపణలు కూడా
2020లో ట్రంప్ ఓటమి తర్వాత ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బిడెన్ ఆరోపిస్తూనే ఉన్నారు. దీనిపై ఆయన సమాఖ్య, రాష్ట్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, అమెరికా ప్రస్తుత ప్రెసిడెంట్ జో బిడెన్ రేసు నుండి నిష్క్రమించిన తర్వాత, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ట్రంప్ పై పోటీలో ఉన్నారు.