Moscow, AUG 24: రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ Yevgeny Prigozhin మరో 9 మంది మరణించారు. రష్యా దేశంలోని అత్యంత శక్తివంతమైన కిరాయి సైనికుడు యెవ్జెనీ ప్రిగోజిన్ (Yevgeny Prigozhin)బుధవారం సాయంత్రం మాస్కోకు ఉత్తరాన కుప్పకూలిన విమానంలో మరణించాడని రష్యా అధికారులు తెలిపారు. (Wagner chief Yevgeny Prigozhin believed killed) ప్రిగోజిన్ ఆర్మీ ఉన్నతాధికారులపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన రెండు నెలల తర్వాత ఈ ఘటన జరిగింది. ఉక్రెయిన్ దేశంతో రష్యా చేసిన యుద్ధం అసమర్థ నిర్ణయం అని ప్రిగోజిన్ వాదించాడు. (Moscow plane crash) గ్రే జోన్‌లోని వాగ్నెర్‌తో అనుసంధానమైన ఒక టెలిగ్రామ్ ఛానల్ ప్రిగోజిన్ మరణించినట్లు ప్రకటించింది. అతన్ని హీరో,దేశభక్తుడిగా కీర్తించింది. అతను గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మరణించాడని టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది.
UPDATE: There are reports that the head of Wagner Group, Yevgeny Prigozhin was on the business plane that crashed today in Russia.
10 people are reportedly dead. It belonged to Prigozhin and Russian media is reporting that he was on the plane.
Wagner sources claim that… pic.twitter.com/RJZWhn1mcF
— Brian Krassenstein (@krassenstein) August 23, 2023
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని వాగ్నెర్ కార్యాలయాలు ఉన్న భవనం చీకటి పడిన తర్వాత ప్రిగోజిన్ మృతికి సంతాప సూచకంగా ఒక పెద్ద శిలువను ప్రదర్శించారు. ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటు చేయడం ద్వారా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహానికి గురయ్యారు. వాగ్నర్ సహ వ్యవస్థాపకుడు కూడా విమానంలో రష్యాకు చెందిన ఏవియేషన్ ఏజెన్సీ రోసావియాట్సియా కూలిపోయిన విమానంలో ఉన్న10 మంది పేర్లను వెల్లడించింది.
This is not surprising... btw another video of the Prigozhin plane crash: pic.twitter.com/P5ciqDRk3M
— ☆.。𝓐𝓷𝓷 𝓢𝓽𝓮𝓲𝓷.。☆ (@Web3Brainiac) August 23, 2023
విమాన ప్రమాదంపై తాము నేర పరిశోధన ప్రారంభించామని రష్యా పరిశోధకులు తెలిపారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణుల ద్వారా విమానం కూల్చివేశారని తాము విశ్వసిస్తున్నట్లు కొన్ని పేరులేని వ్యక్తులు రష్యా మీడియాకు తెలిపారు. మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరిన విమానం ట్వెర్ ప్రాంతంలోని కుజెంకినో గ్రామ సమీపంలో కూలిపోయిందని రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది.